జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌పై ఫైనల్ నోటిఫికేషన్ విడుదల

జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌కు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.

By -  Knakam Karthik
Published on : 26 Dec 2025 7:37 AM IST

Hyderabad New, GHMC, GHMC Delimitation, Final Notification

జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌పై ఫైనల్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌కు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. డివిజన్ల సంఖ్యను 300లకు పెంచుతూ.. ప్రస్తుతమున్న ఆరు జోన్లను 12కు, ఇదివరకున్న 30 సర్కిళ్లను 60కి పెంచుతూ నోటిఫికేషన్ వెలువరించింది. జీహెచ్ఎంసీలో కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఏర్పడ్డాయి. సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

డివిజన్ల డీలిమిటేషన్‌కు సంబంధించి ఈనెల 9న ప్రాథమికి నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతో.. 6 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో సహేతుకుమైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంది జీహెచ్‌ఎంసీ. వీటిని పరిశీలించి.. గురువారం డీలిమిటేషన్‌కు సంబంధించి తుది నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి నూతన జోన్ కార్యాలయాలు ప్రారంభంకానున్నాయి. సర్కిల్ ఆఫీసులలో కొత్త జోన్ కార్యాలయాలు, వార్డు ఆఫీసులలో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

కొత్త జోన్లకు కమిషనర్లుగా ఐఏఎస్‌ అధికారులు

మరో వైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో కొత్తగా ఏర్పాటైన జోన్లకు కమిషనర్లను నియమించింది. 12 జోన్లలో 8 జోన్లకు కమిషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించారు. శేరిలింగంపల్లి- హేమంత్, కూకట్‌పల్లి- అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్- సందీప్ కుమార్ ఝా, ఖైరతాబాద్-ప్రియాంక, రాజేంద్రనగర్- అనురాగ్ జయంతి, ఎల్బీనగర్- హేమంత్ కేశవ్ పాటిల్, మల్కాజ్‌గిరి- సంచిత్ గంగ్వార్, ఉప్పల్-రాధిక గుప్తా, చార్మినార్- శ్రీనివాస్ రెడ్డి, సికింద్రాబాద్- రవికిరణ్, గోల్కొండ- ముకుందరెడ్డి, శంషాబాద్- చంద్రకళ..లను నియమిస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story