IPL-2024: ఉప్ప‌ల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌.. ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు

ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది.

By అంజి  Published on  26 March 2024 1:15 PM IST
cricket fans, tsrtc , special buses, uppal, IPL match

IPL-2024: ఉప్ప‌ల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌.. ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు

ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఇటీవలే ప్రారంభం అయ్యాయి. ఇవాళ ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్‌ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ని వీక్షించేందుకు సిద్ధమవుతున్న క్రికెట్‌ అభిమానులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) గుడ్‌న్యూస్‌ చెప్పింది. క్రికెట్‌ మ్యాచ్‌ కోసం వెళ్లేందుకు సిద్ధపడుతున్న అభిమానుల రాకపోకలను సులభతరం చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను నడుపుతోందని ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ తెలిపారు.

క్రికెట్ అభిమానుల సౌకర్యార్థం హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 స్పెషల్ బ‌స్సుల‌ను న‌డుపుతోంది. బుధవారం సాయంత్రం 6 గంట‌లకు ప్రారంభ‌మై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బ‌య‌లుదేరుతాయి. ఈ ప్రత్యేక బ‌స్సుల‌ను వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాల‌ని క్రికెట్ అభిమానుల‌ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరింది.

Next Story