శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కిలో బంగారం పట్టివేత

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పెద్దఎత్తున బంగారం పట్టుకున్నారు

By Srikanth Gundamalla  Published on  23 Oct 2023 10:27 AM IST
gold seized,  shamshabad airport, customs,

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కిలో బంగారం పట్టివేత 

విదేశాల నుంచి అక్రమంగా బంగారం, డబ్బు, డ్రగ్స్‌ తరలించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు కొందరు ప్రయాణికులు. కొత్త కొత్త ఆలోచనలతో కస్టమ్స్‌ అధికారులకు చిక్కకుండా అక్రమ రవాణా చేసేందుకు చూస్తారు. కానీ.. చివరకు పట్టుబడి కటకటాల పాలవుతుంటారు. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు ప్రయాణికులు బంగారం తరలిస్తూ అధికారులకు చిక్కాడు.

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పెద్దఎత్తున బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులను గుర్తించారు. వారి నుంచి దాఆపు కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారం అక్రమంగా తీసుకొచ్చిన ప్రయాణికులు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నారు. దాంతో.. వారిని గమనించిన ఎయిర్‌పోర్టు అధికారులు తీసుకెళ్లి తనిఖీలు చేశారు. ఓ ప్రయాణికుడు లగేజ్‌ బ్యాగులో బంగారం పట్టుకున్నారు. 610 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.32.8 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

ఆ తర్వాత మరో ప్రయాణుకుడిని కూడా అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. అతడి వద్ద నుంచి 483 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఒకేరోజు ఇద్దరు ప్రయాణికులు పట్టుబడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇక వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అదికారులు.

Next Story