Hyderabad: ఎన్నికల వేళ కోట్ల విలువైన బంగారం..భారీగా నగదు సీజ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీ మొత్తంలో బంగారం, నగదుని సీజ్ చేస్తున్నారు పోలీసులు.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 6:45 PM ISTHyderabad: ఎన్నికల వేళ కోట్ల విలువైన బంగారం..భారీగా నగదు సీజ్
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ ౩౦ వ తేది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కు సంబందించి ఎన్నికల నియమావళి అమలు లోకి రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎన్నికల సందర్భంగా నగరంలో పెద్ద మొత్తంలో నగదు, బంగారం, మద్యం చేతులు మారుతూ ఉంటాయిజ ప్రజలను ప్రలోభ పెట్టి ఎన్నికల్లో గెలవడానికి నాయకులు రకరకాల పద్ధతులను ఉపయోగించి జనాలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి హైదరాబాద్ సిటీ పోలీస్ నగర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలో అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్ తో పాటు ఓటర్లను ప్రలోభ పెట్టె ఇతర వస్తువులపై దాడులను ముమ్మరం చేసారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో అక్టోబర్ 9 వ తేది నుండి అక్టోబర్ 11వ తేదీ ఉదయం వరకు జరిపిన ఆకస్మిక తనిఖీలలో పెద్ద ఎత్తున నగదు, లిక్కర్ తదితర వస్తువులను సీజ్ చేసామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు.
కేవలం ఈ మూడు రోజుల్లోనే 42 కోట్లు విలువ చేసే 7.706 కిలోల బంగారం సీజ్ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. అలాగే రూ.8.77 లోలు విలువ చేసే 11.700 కిలో వెండితో పాటు.. రూ.5.1 కోట్ల నగదు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 110 లీటర్ల మద్యం సీసాలు, 23 మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లు చెప్పారు సీవీ ఆనంద్. 43 క్వింటాళ్ల రేషన్ బియ్యం కూడా పట్టుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో జంట నగరాల్లో స్థానిక పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు , టాస్క్ ఫోర్స్ సహా ఇతర విబాగాలు 24/7 పర్యవేక్షిస్తూ గట్టి చర్యలు చేపట్టారని చేపట్టారు. ప్రజలు అందరు కూడా తమ ప్రాంతాలలో అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సూచించారు.