హైదరాబాద్‌లో రెండు మోడల్ కారిడార్లు.. అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ సన్నాహాలు
GHMC to develop two model corridors in Chandrayangutta and Rajendranagar circles. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) చార్మినార్ జోన్‌లోని చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్ సర్కిళ్లలో రెండు
By అంజి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) చార్మినార్ జోన్‌లోని చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్ సర్కిళ్లలో రెండు మోడల్ కారిడార్లను అభివృద్ధి చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) సన్నాహాలు చేస్తోంది. దీని అంచనా వ్యయం రూ. 12 కోట్లు. ఇది మెరుగైన ట్రాఫిక్‌తో పాటు ప్రధాన రహదారుల పరిస్థితులను మెరుగుపరచడానికి సహాయపడనుంది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు కారిడార్‌లను నిర్మిస్తున్నారు. కారిడార్‌లలో సెంట్రల్ మీడియన్‌కు ఆనుకుని మూడు లేన్‌ల ప్రధాన క్యారేజ్‌వే ఉంటుంది. ఇందులో ప్రధాన క్యారేజ్‌వేకు ఆనుకుని ఆరు మీటర్ల సర్వీస్ రోడ్డు కూడా ఉంది. ప్లాన్ ప్రకారం.. మోడల్ కారిడార్‌లలో ఒకటి చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ నుండి చాంద్రాయణగుట్ట సర్కిల్‌లోని మొఘల్స్ కాలనీ వరకు, మరొకటి రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మొఘల్స్ ఇంజనీరింగ్ కళాశాల నుండి దుర్గానగర్ జంక్షన్ వరకు ఉంటుంది. రెండు కారిడార్లకు మొత్తం ఖర్చు రూ. 12 కోట్లు కానుంది.
ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. జీహెచ్‌ఎంసీ ఆరు నెలల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని యోచిస్తోంది. దీనికి జనరల్ బాడీ, స్టాండింగ్ కమిటీ నుండి పరిపాలనా అనుమతి కూడా లభించింది. కారిడార్లలో రోడ్లు 150 అడుగుల వెడల్పు ఉన్నందున ఈ రెండు సర్కిళ్లను ఎంపిక చేశారు. అధికారులు త్వరలోనే ఆయా ఏరియాల్లో ఆక్రమణలను తొలగిస్తారు. అవసరమైతేఆస్తులను స్వాధీనం చేసుకుంటామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. కారిడార్‌లలోని రోడ్లు సరైన మురికినీటి కాలువ మౌలిక సదుపాయాలను కలిగి ఉంటాయి. భూసేకరణ లేకుండానే మూడు వరుసల రోడ్లు (10.50 మీటర్లు), సర్వీస్ రోడ్డుతో కూడిన ప్రధాన క్యారేజ్‌వేను అభివృద్ధి చేయవచ్చని వారు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న ప్రధాన రహదారి విస్తరణను దృష్టిలో ఉంచుకుని రూ.6 కోట్లతో అంచనాలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. నగరంలోని ఇతర రోడ్లతో పోలిస్తే ఈ రోడ్లకు సరైన స్ట్రామ్‌వాటర్ డ్రెయిన్ మౌలిక సదుపాయాలు ఉంటాయని వారు సూచించారు. అదేవిధంగా, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ నుండి మొఘల్ కాలనీ వరకు 2.10 కి.మీ పొడవు గల మోడల్ కారిడార్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (RDP) ప్రకారం 150 అడుగుల (45 మీటర్లు) రోడ్డు వెడల్పు కలిగి ఉంది. అయితే క్యారేజ్‌వే వెడల్పు ఆరు లేన్‌లు మాత్రమే. సర్వీస్ రోడ్డుకు డివైడర్, ఆరు మీటర్ల వెడల్పుతో వాక్యూమ్ డీవాటర్డ్ సిమెంట్ కాంక్రీట్ (వీడీసీసీ) సర్వీస్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.