గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్న ప్ర‌ముఖులు

GHMC Polling Started At Morning. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

By Medi Samrat  Published on  1 Dec 2020 2:41 AM GMT
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్న ప్ర‌ముఖులు

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 150 డివిజన్‌లకు ఎన్నికలు జరుగుతుండగా... 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 9,101 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

దాదాపు 48000 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 52,500మంది పోలీస్ సిబ్బంది తమ విధుల్లో పాల్గొన్నారు. 74,44,260లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు ఉదయాన్నే పోలింగ్ బూతులకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఓటు వేశారు. ఉదయం జూబ్లీహిల్స్‌ క్లబ్‌‌కు చేరుకున్న చిరంజీవి దంపతులు ఓటు వేశారు. అలాగే నాంపల్లిలో సీపీ సజ్జనార్‌, కుందన్‌బాగ్‌లో రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఎఫ్‌ఎన్‌సీసీలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓటేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అలాగే.. అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్లో ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నగర వాసులకు అంజన్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌ నందినగర్‌లో మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Next Story