గతం కంటే స్వల్పంగా పెరిగిన పోలింగ్‌ శాతం.. ప్రకటించిన అధికారులు

GHMC Polling percentage ... గ్రేటర్‌ హైదరాబాద్‌లో మున్సిపల్‌ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్‌ నమోదైనట్లు జీహెచ్‌ఎంసీ ఎ

By సుభాష్  Published on  2 Dec 2020 1:32 PM GMT
గతం కంటే స్వల్పంగా పెరిగిన పోలింగ్‌ శాతం.. ప్రకటించిన అధికారులు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మున్సిపల్‌ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్‌ నమోదైనట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తెలిపారు. గ్రేటర్‌లో 149 డివిజన్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్‌ శాతాన్ని ఆయన వెల్లడించారు. ఇందులో అత్యధికంఆ ఆర్‌సీపురం డివిజన్‌లో 67.71 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా యూసఫ్‌గూడ డివిజన్‌లో 32.99 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం నమోదైంది. దీంతో పోల్చితే ప్రస్తుతం ఎన్నికల్లో స్వల్పంగా ఓటింగ్‌ శాతం పెరిగింది.

ఇక ఓల్డ్‌ మలక్‌పేటలో రేపు రీపోలింగ్ జరగనుంది. సీపీఐ, సీపీఎం పార్టీల గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్‌ నిలిపివేసి రీపోలింగ్‌ ప్రకటించారు అధికారులు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్‌ నిర్వహిస్తారు. ఇక్కడ ఆరుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇందుకోసం డివిజన్‌ పరిధిలో 69 పోలింగ్‌ కేంద్రాలను ఎస్‌ఈఐ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో డివిజన్‌ పరిధిలో కేంద్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలకు సెలవు ప్రకటించినట్లు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి తెలిపారు.

ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 4న జరగనుంది. మొత్తం 30 కేంద్రాల్లో శుక్రవారం ఉదయం8 గంటల నుంచి ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Next Story