జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: భారీగా తగ్గిన పోలింగ్‌ శాతం

GHMC Polling percentage I జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: భారీగా తగ్గిన పోలింగ్‌ శాతం

By సుభాష్  Published on  2 Dec 2020 2:04 AM GMT
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: భారీగా తగ్గిన పోలింగ్‌ శాతం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ మందకోడిగా సాగింది. ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం భారీగా తగ్గింది. మంగళవారం జరిగిన పోలింగ్‌లో సుమారు 43 శాతం నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. అయితే ఖచ్చితమైన పోలింగ్‌ శాతాన్ని బుధవారం ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్‌ నమోదు అయింది. ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌,బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం హోరా హోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ ప్రచారంతో పాటు పోలింగ్‌ సమయంలో కూడా అక్కడక్కడ కొన్ని ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వరుసగా సెలవులు రావడం, కరోనా భయం ఉండటం కారణంగా ఓటర్లు కూడా ఓటు వేసేందుకు వెనుకంజ వేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే కొన్ని డివిజన్లలో 30 శాతం కంటే తక్కువే పోలింగ్‌ నమోదైంది. గతంలో కంటే మరింత దారుణంగా ఓటింగ్‌ శాతం నమోదైంది. ఇక ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో అక్కడ పోలింగ్‌ నిలిపివేసి రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సెలబ్రీటీలు కూడా భారీ ఎత్తున ప్రచారం చేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పోలింగ్‌ శాతం మరీ దారుణంగా పడిపోయింది.

కరోనా భయం, సెలవులు రావడంతో ఓటర్లు హైదరాబాద్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోలింగ్‌లో కనీసం 60శాతం పైగా నమోదు అవుతుందని అధికారులు ముందుగా భావించినా.. అది జరగలేదు.

Next Story