గణేష్ చతుర్థి పండుగ.. అన్ని ఏర్పాట్లు చేసిన జీహెచ్‌ఎంసీ

GHMC made all the arrangements for the Ganesh Chaturthi festival. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఆగస్ట్ 31 నుండి ప్రారంభమయ్యే గణేష్ చతుర్థి పండుగను

By అంజి  Published on  30 Aug 2022 5:49 AM GMT
గణేష్ చతుర్థి పండుగ.. అన్ని ఏర్పాట్లు చేసిన జీహెచ్‌ఎంసీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఆగస్ట్ 31 నుండి ప్రారంభమయ్యే గణేష్ చతుర్థి పండుగను సజావుగా నిర్వహించడానికి విస్తృతమైన ఏర్పాట్లను ప్రారంభించింది. గణేష్ విగ్రహ నిమజ్జనాన్ని సులభతరం చేయడానికి జీహెచ్‌ఎంసీ.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చెరువుల వద్ద 280 క్రేన్‌లను మోహరించనుంది. ఇక చెరువుల దగ్గర పేరుకుపోయే చెత్తను వెంట వెంటనే తొలగించేందుకు నగర పరిధిలో 9,000 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించింది.

హుస్సేన్‌సాగర్‌, ఎన్టీఆర్ మార్గ్, సరూర్‌నగర్ సరస్సు, సంజీవయ్య పార్క్ బేబీ పాండ్ వంటి కొన్ని ప్రదేశాలలో క్రేన్‌లను మోహరిస్తారు. జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిమజ్జన ప్రదేశంలో ప్రతి క్రేన్‌కు ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్మికుల బృందం ఉంటుంది. ''పారిశుద్ధ్య కార్మికులు మూడు షిఫ్టుల్లో పని చేస్తారు. ప్రతి క్రేన్ వద్ద ఏడుగురు కార్మికులు ఉంటారు. తాత్కలికంగా రూపొందించిన ప్రతి చెరువు వద్ద దాని పరిమాణం ఆధారంగా ఏడు నుండి 14 మంది కార్మికులు ఉంటారు'' అని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. నిమజ్జన ఊరేగింపు మార్గంలో ప్రతి 3 కిమీ నుండి 4 కిమీ వరకు.. 21 మంది పారిశుధ్య కార్మికులు ఉంటారు.

గణేష్‌ పండుగ నేపథ్యంలో.. పర్యావరణ పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ పలు చర్యలు చేపట్టనుంది. గణేష్‌ విగ్రహాల నిమజ్జనాలను సరస్సుల్లో కాకుండా.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక చెరువుల్లో నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రజలను జీహెచ్‌ఎంసీ ప్రోత్సహిస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 24 పోర్టబుల్ ప్రిఫ్యాబ్రికేటెడ్ ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్ చెరువులు రానున్నాయి. భూమిని తవ్వి సరస్సుల దగ్గర నిర్మించిన కృత్రిమ చెరువుల మాదిరిగా కాకుండా.. ఈ పోర్టబుల్ చెరువులను అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు, కూల్చివేయవచ్చు.

కృత్రిమ చెరువులను సిద్ధం చేయడమే కాకుండా, రోడ్ల పునరుద్ధరణ, లైటింగ్‌, ఊరేగింపు మార్గంలో విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రదేశాల్లో మొబైల్ వాష్‌రూమ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఊరేగింపు మార్గంలో రోడ్ల పునరుద్ధరణకు సంబంధించిన అన్ని పనులు పూర్తి కావొచ్చాయి. ఇదిలా ఉండగా.. గణేష్‌ నిమజ్జనం జరిగే 3, 5, 7, 9,11వ రోజుల్లో.. నిమజ్జన ప్రదేశాలలో HMWS And SB తాగునీటిని అందించనుంది.

Next Story
Share it