గ్రేటర్ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..!
GHMC exit polls 2020.. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ రోజు ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్ ప్రశాంతంగా
By సుభాష్ Published on 3 Dec 2020 7:49 PM ISTగ్రేటర్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ రోజు ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. దీంతో ఈ రోజు గ్రేటర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టీఆర్‌ఎస్ పార్టీకే పట్టం కట్టాయి. గతంలో కంటే సీట్లు తగ్గుతున్నా.. టీఆర్‌ఎస్ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఓట్ల శాతం మెరుగ్గా ఉన్నా సీట్లలో బీజేపీ వెనుకబడే అవకాశం ఉన్నట్లు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇక మజ్లిస్ పార్టీ 40 శాతం కంటే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా తెలుస్తోంది.
కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉంది. పీపుల్స్‌పల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల ప్రకారం పరిశీలిస్తే... టీఆర్‌ఎస్‌కు 68-78స్థానాలు, బీజేపీకి 25-35, ఎంఐఎంకు 38-42 స్థానాలు, కాంగ్రెస్ కు 1-5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్ మ్యాజిక్ ఫిగర్ 76కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం టీఆర్‌ఎస్, బీజేపీకి మధ్య 6 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.
ఆరా సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. టీఆర్‌ఎస్‌కు 71-85 స్థానాలు, ఏఐఎం 36--46 స్థానాలు, బీజేపీ 23-33 స్థానాలు, కాంగ్రెస్ 0-6 స్థానాలు కైవసం చేసుకోనున్నాయి.
ఇక మరో సంస్థ అయిన జన్‌కీ బాత్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఫలితాలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి. టీఆర్‌ఎస్‌కు 67-77 స్థానాలు, ఏఐఎంఐఎం 39-43 స్థానాలు, బీజేపీ 24-42 స్థానాలు, కాంగ్రెస్ 4.2 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉంది. ఇతరులు 2 -5 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఎన్‌ఎఫ్‌ఓ సర్వే ప్రకారం.. టీఆర్‌ఎస్ 85-95 స్థానాలు, బీజేపీ 15-25 స్థానాలు, కాంగ్రెస్ 2-3 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని వెల్లడించింది.