గ్రేటర్‌ పోరు: అత్యధికంగా ఉన్న ఓటర్లు ఎక్కడంటే..

GHMC elections Polling I గ్రేటర్‌ పోరు: అత్యధికంగా ఉన్న ఓటర్లు ఎక్కడంటే..

By సుభాష్  Published on  1 Dec 2020 8:50 AM IST
గ్రేటర్‌ పోరు: అత్యధికంగా ఉన్న ఓటర్లు ఎక్కడంటే..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రధాన పార్టీ అభ్యర్థులు నువ్వా.. నేనా.. అన్న రీతిలో కొనసాగిన ఈ ఎన్నికల ప్రచారంలో నేడు ప్రశాంతంగా పోలింగ్‌ కొనసాగుతోంది. ఎప్పుడు లేని విధంగా నోటిఫికేషన్‌ వచ్చిన రెండు వారాల్లోనే ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాన పార్టీలన్ని అభ్యర్థుల ఎంపికపై భారీ కసరత్తు చేశాయి. ఓటర్ల జాబితా ప్రకటించడంతో పాటు దానిని అధికారిక వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచింది ఎన్నికల సంఘం. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో 9,248 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నాలుగు జిల్లాలకు విస్తరించి ఉంది. అందులో 6 జోన్లు, 30 సర్కాళ్లు ఉన్నాయి. వీటితో పాటు 23 శాసనసభ స్థానాలు, 5 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. మొత్తం డివిజన్లలో అత్యధిక ఓటర్లు మైలాక్‌దేవునిపల్లిలో ఉండగా, అత్యల్పంగా రామచంద్రాపురం (ఆర్సీపురం)లో ఉన్నారు.

మొత్తం 150 డివిజన్లు.. మొత్తం ఓటర్లు 74,04,286 ఇందులో పురుషులు - 38,56,770, స్త్రీలు - 35,46,847, ఇతరులు - 669

జిల్లాలు... డివిజన్లు

హైదరాబాద్‌ - 84, మేడ్చల్‌ - 38, రంగారెడ్డి - 25, సంగారెడ్డి - 3

జోన్లు :

1. ఎబ్బీనగర్‌, 2. ఖైరతాబాద్‌, 3. కూకట్‌పల్లి , 4. చార్మినార్‌ , 5. సికింద్రాబాద్‌ 6, శేరిలింగంపల్లి

అసెంబ్లీ నియోజకవర్గాలు :

1. మల్కాజ్‌గిరి, 2. జూబ్లీహిల్స్‌, 3. ముషీరాబాద్‌, 4. మలక్‌పేట, 5. ఉప్పల్‌, 6. బహదూర్‌పురా. 7. కుత్బుల్లాపూర్‌. 8. కూకట్‌పల్లి. 9. ఖైరతాబాద్‌. 10. గోషామహాల్‌. 11. ఎల్బీనగర్‌. 12. కార్వాన్‌. 13. అంబర్‌పేట. 14. శేరిలింగంపల్లి. 15. సికింద్రాబాద్‌. 16. రాజేంద్రనగర్‌. 17. కంటోన్మెం్‌. 18. చార్మినార్‌. 19. సనత్‌నగర్‌. 20. నాంపల్లి. 21. చంద్రాయణగుట్ట. 22. యాకత్‌పురం. 23. పటాన్‌చెరు

లోక్‌సభ స్థానాలు - అందులో ఉన్న డివిజన్ల వివరాలు:

మల్కాజిగిరి - 47, హైదరాబాద్‌ - 43, సికిద్రాబాద్‌ - 40, చేవెళ్ల - 17 , మెదక్‌ - 3,

ఎక్కువగా ఓటర్లు ఉన్న డివిజన్లు:

మైలాక్‌ దేవునిపల్లి - 79,290 ఓటర్లు ,హఫీజ్‌పేట - 70,305, కొండాపూర్‌ - 69,198, సుభాష్‌ నగర్‌ - 67,057, శేరిలింగంపల్లి - 65,231

తక్కువ ఓటర్లు ఉన్న డివిజన్లు :

రామచంద్రాపురం - 27,998 ఓటర్లు, దత్తాత్రేయనగర్‌ - 29,959, భారతీనగర్‌ - 31,737, మెహదీపట్నం - 34,238, చింతల్‌ - 34,656

Next Story