జీహెచ్‌ఎంసీ నూత‌న‌ కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం పూర్తి

GHMC Corporators Oath Taking Completed. నూత‌నంగా ఎన్నికైన జీహెచ్‌ఎంసీ‌ కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం పూర్త‌య్యింది.

By Medi Samrat  Published on  11 Feb 2021 11:33 AM IST
GHMC Corporators Oath Taking Completed

నూత‌నంగా ఎన్నికైన జీహెచ్‌ఎంసీ‌ కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం పూర్త‌య్యింది. ఇందుకోసం అధికారులు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 150 డివిజన్లకు గానూ 149 మంది కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవ‌ల‌ లింగోజిగూడ కార్పొరేటర్ మృతి చెందారు. దీంతో 149 మంది కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ.. నాలుగు భాషల్లో ప్రమాణ ప్రక్రియ జ‌రిగింది. ప్రిసైడింగ్‌ అధికారిగా ఉన్న కలెక్టర్ శ్వేతా మహంతి వారితో ప్రమాణం చేయించారు.

ముందుగా శ్వేతామహంతి సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశానికి హాజరైన సభ్యులకు తొలుత ఆమె ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిజయేశారు. ఒక్కో పార్టీలతో కూడిన సభ్యులు ఓ గ్రూపుగా ఏర్పడి ప్రమాణం చేస్తామని కొందరు కోరారు. భాషల ప్రతిపాదికన గ్రూపులుగా ఏర్పడిన ప్రమాణం చేస్తామని మరికొందరు కోరగా.. కలెక్టర్‌ శ్వేతామహంతి దానికి అంగీకరించారు. కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంత‌రం 12:30 నిమిషాలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరుగనుందని శ్వేతామహంతి‌ తెలిపారు. మేయ‌ర్ ఎన్నిక‌కు పది నిమిషాల ముందు సభ్యులంతా కౌన్సిల్‌ హాల్‌లోకి రావాలని సూచించారు.



Next Story