సమస్యల పరిష్కార వేదికగా వార్డు కార్యాలయాలు -జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్

పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా జిహెచ్ఎంసిలో వార్డు కార్యాలయాల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి ..

By Srikanth Gundamalla
Published on : 17 Jun 2023 7:08 AM IST

GHMC, Ward Offices, Commissioner Lokesh Kumar, KTR

సమస్యల పరిష్కార వేదికగా వార్డు కార్యాలయాలు -జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్

పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా జిహెచ్ఎంసిలో వార్డు కార్యాలయాల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేస్తారని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు.

రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అంబర్ పెట్ సర్కిల్ లో కాచిగూడ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన తదనంతరం ఏర్పాటు చేసిన సభలో ముందుగా కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. 150 వార్డులకు గాను 132 వార్డులను ప్రారంభించనున్నట్లు మిగతా 18 వార్డులను వారం రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు లోకేష్‌ కుమార్ తెలిపారు.

ముఖ్యంగా ప్రజలకు 5 వ్యవస్థలకు సంబంధించిన సమస్యలపై ఎక్కువగా ప్రజలు తమ వ్యక్తిగత సామాజిక సమస్యల పై విన్నవించడం జరుగుతున్నదన్నారు. మున్సిపల్, రెవెన్యూ, ఆరోగ్య, పోలీస్, విద్యుత్ వ్యవస్థలకు సంబంధించినవి కాగా వార్డు కార్యాలయాల్లో వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖ కు సంబంధించిన అధికారులు కూడా వార్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రి నీ కోరారు. వార్డు కార్యాలయంలో మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలే కాకుండా ఇతర శాఖల సమస్యలను కూడా స్వీకరించి సంబంధించిన శాఖకు తెలియజేయడం జరుగుతుందన్నారు. గౌరవ మంత్రివర్యులు ఆదేశాల ప్రకారం వార్డు వ్యవస్థ పనితీరును సమీక్షించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ లోకేష్‌ కుమార్ తెలిపారు.

వార్డు కార్యాలయం ఏర్పాటుకు దేశంలో గల మెట్రో పాలిటి నగరాలైన చెన్నై , బెంగుళూరు, కలకత్తా, ముంబాయి, ఢిల్లీ నగరాలకు అధికారులను పరిశీలించడానికి పంపించడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలు విన్నవించడానికి ఇక నుండి జోనల్ , సర్కిల్ కార్యాలయాలకు వెళ్లకుండా స్థానిక వార్డు కార్యాలయం వచ్చి సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు కమిషనర్ లోకేష్ కుమార్.

జల మండలి ఏం డి దాన కిషోర్ మాట్లాడుతూ.. కాచిగూడ వార్డులో 50 వేల జనాభా ఉంటే 5200 నల్లా కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. త్రాగు నీరు నిర్దేశించిన ప్రకారం గా సప్లై చేస్తున్నప్పటికీ

కొన్ని కొన్ని సార్లు లో ప్రెషర్ అంతేకాకుండా సివరేజీ సమస్య కూడా అనుకోకుండా వస్తుందని చెప్పారు. అందుకు వార్డు కార్యాలయం సిబ్బందికి మెన్ మెటీరియల్ సిద్ధంగా ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు కాలేరు వెంకటేష్, కౌన్సిలర్ శ్రీమతి ఉమాదేవి, ఈ వి డీ ఏమ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, యుబిడి అడిషనల్ కమిషనర్ వి కృష్ణ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డి సి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story