రికార్డు స్థాయిలో జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను వసూలు
GHMC collects record property tax, nets Rs 1,000 crore within six months. హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఆస్తిపన్ను వసూళ్లు ఆరు నెలల్లోనే
By అంజి Published on 30 Oct 2022 4:20 AM GMTహైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఆస్తిపన్ను వసూళ్లు ఆరు నెలల్లోనే రూ.1,000 కోట్ల మార్క్‌ను అధిగమించింది. ఇప్పటి వరకూ ఏ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఇంత ఆస్తి పన్ను వసూలు కాలేదు. జిహెచ్‌ఎంసిలో 30 సర్కిళ్లు ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీ వరకు మొత్తంగా రూ.1,165.17 కోట్లు వసూలయ్యాయి. శేరిలింగంపల్లి సర్కిల్ రూ. 171.23 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, జూబ్లీహిల్స్ సర్కిల్ (రూ. 119.49 కోట్లు), ఖైరతాబాద్ సర్కిల్ (రూ.92కోట్లతో) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఈ ఏడాది చాలా మంది ఆస్తి యజమానులు ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించగా, మరికొందరు మీ సేవా కేంద్రాల ద్వారా చెల్లించారు. పలువురు ఆస్తి యజమానుల నుంచి బిల్లు కలెక్టర్లు పన్ను వసూలు చేయడమే కాకుండా జీహెచ్‌ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లను సందర్శించి చెల్లించిన వారు కూడా ఉన్నారు. జూలైలో ప్రవేశపెట్టిన వన్-టైమ్ స్కీమ్ (OTS)తో, 47,205 అసెస్‌మెంట్ల ద్వారా రూ.92.78 కోట్లు వసూలు చేయబడ్డాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి అక్టోబర్ 28 వరకు ఆర్జించిన రూ.1,165 కోట్ల ఆదాయంలో ఈ ఆదాయం భాగం.
ఆస్తి పన్ను బకాయిలతో ఇబ్బంది పడుతున్న వారికి వన్-టైమ్ స్కీమ్ ఉపశమనం అందించింది. ఈ పథకం అక్టోబర్ 31తో ముగియనుంది. ఈ పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుపై 90 శాతం పేరుకుపోయిన బకాయి వడ్డీని మాఫీ చేయాలని ఆదేశించింది. కానీ, పన్ను చెల్లింపుదారు 2021-22 వరకు పన్ను బకాయిల అసలు మొత్తాన్ని, 10 శాతం సేకరించిన వడ్డీతో పాటు ఒకేసారి క్లియర్ చేయాలి. ఓటీఎస్ కింద వసూలు చేసే పన్నును మరింత పెంచే యోచనలో ఉంది.
ఆదాయ పునరుద్ధరణ చర్యలో భాగంగా జిహెచ్‌ఎంసి కమీషనర్ అక్టోబర్ 30, అంటే ఆదివారం అధికారులకు పని దినంగా ఉండాలని ఆదేశించారు. "ఓటీఎస్ సోమవారం ముగియడంతో, బిల్ కలెక్టర్లు ఆదివారం ఇళ్లను సందర్శించి, బకాయి వడ్డీని క్లియర్ చేయమని ప్రజలను అడుగుతారు. కార్యకలాపాలను కార్పొరేషన్ సీనియర్ అధికారులు కూడా పర్యవేక్షిస్తారని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.