హైదరాబాద్‌లో గంజాయి సరఫరా ముఠా అరెస్ట్..38 ప్యాకెట్ల గంజాయి సీజ్

హైదరాబాద్‌ గోల్కొండలో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తులను స్టేట్ టాస్క్ ఫోర్స్ (ఎక్సైజ్ శాఖ) ఆదివారం అరెస్ట్ చేసింది

By -  Knakam Karthik
Published on : 5 April 2026 10:00 PM IST

Hyderabad Crime, GanjaSeized, Golconda, DrugBust

హైదరాబాద్‌లో గంజాయి సరఫరా ముఠా అరెస్ట్..38 ప్యాకెట్ల గంజాయి సీజ్

హైదరాబాద్‌ గోల్కొండలో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తులను స్టేట్ టాస్క్ ఫోర్స్ (ఎక్సైజ్ శాఖ) ఆదివారం అరెస్ట్ చేసింది. వీరి వద్ద నుంచి 38 ప్యాకెట్లలో దాచి ఉంచిన రెండు కిలోల గంజాయితో పాటు మూడు ఆటోలు, మూడు మోటార్ సైకిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను పరీక్షించగా వారు డ్రగ్స్ సేవించినట్లు తేలింది. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు విద్యార్థులు వీరికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కేసులో మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేయగా, పరారీలో ఉన్న మిగిలిన ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story