గణనాథుల నిమజ్జనాలపై తలసాని, మహమూద్‌అలీ ఏరియల్ వ్యూ
నిమజ్జనాలు జరుగుతున్న తీరుని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
By Srikanth Gundamalla Published on 28 Sept 2023 5:24 PM ISTగణనాథుల నిమజ్జనాలపై తలసాని, మహమూద్‌అలీ ఏరియల్ వ్యూ
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. నగరం నలుమూలల నుంచి నిమజ్జనాల కోసం భక్తులు గణనాథుల విగ్రహాలను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో నిమజ్జనాలు జరుగుతున్న తీరుని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో మంత్రులు ఏరియల్ సర్వే చేశారు. మంత్రులతో పాటు ఈ ఏరియల్ వ్యూలో యలుదేరారు. హోమ్ మినిస్టర్ తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిజిపి అంజనీ కుమార్, హైదరాబాద్ సిపి ఆనంద్ పాల్గొన్నారు.
నగరంలో పలుచోట్ల గణేశ్ శోభాయాత్ర కోసం చేసిన ఏర్పాట్లను మంత్రులు, అధికారులు పరిశీలించారు. భారీ బందోబస్తుతో పాటు.. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రులు తెలిపారు. గణేశ్ నిమజ్జనం సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేశామన్నారు. రేపు ఉదయం వరకు నిమజ్జనాలు కొనసాగుతాయని అన్నారు. ఎప్పటికప్పుడు నిమజ్జనం జరుగుతున్నతీరుని పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షిస్తున్నారని చెప్పారు మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ట్యాంక్ బండ్‌కు వెళ్లారు. గణేశ్ నిమజ్జనాలను దగ్గరుండి పరిశీలించారు.
హైదరాబాదు నగరం గణేశుడి శోభాయాత్రతో మారుమోగుతుంది. గత 11 రోజులుగా గణపతయ్య నవరాత్రులు జరుపుకొని నిమజ్జనానికి తరలివెళ్తున్నాయి. నిన్నటి నుండి ట్యాంక్‌బండ్‌పై గణేష్ విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. ఖైరతాబాద్ గణేశుడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిమజ్జనం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున గణేశుడి శోభాయాత్రలో పాల్గొని తీన్మార్ డాన్స్ చేస్తూ ఆనంద ఉత్సాహాలతో హోరెత్తిస్తున్నారు. విధుల్లో పాల్గొన్న పోలీసుల సైతం డీజే పారు. ఈ విధంగా నగరంలో పలుచోట్ల నుండి గణనాథులు నిమజ్జనం కొరకు ట్యాంక్బండ్ వైపు తరలివస్తున్నాయి.