జీహెచ్ఎంసీ(గ‌్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మి కొద్దిసేపటిక్రితం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ముందుగా ఆమె మేయర్ చాంబర్‌లో సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన మేయర్‌గా ప్రమాణస్వీకారం చేసిన విజయలక్ష్మి.. ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పోరేటర్లు హాజరయ్యారు.
2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా గెలుపొందారు. అంతకుముందు అమెరికాలో ఉన్నారు. హైదరాబాద్‌లోని హోలీ మేరి స్కూల్‌లో ప్రాథమిక విద్యను, రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఇంటర్, భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం చేశారు. ఆపై సుల్తాన్ ఉల్ లూమ్ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు.