వేస్ట్ మెటీరియల్స్ తో ప్లే గ్రౌండ్

From Scrap to interactive playgrounds Anthill creations develops sustainable playscapes for underprivileged children.2017లో ఖరగ్‌పూర్ ఐఐటీకి చెందిన

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 April 2022 9:01 AM GMT
వేస్ట్ మెటీరియల్స్ తో ప్లే గ్రౌండ్

హైదరాబాద్: 2017లో ఖరగ్‌పూర్ ఐఐటీకి చెందిన ముగ్గురు ఆర్కిటెక్చర్ విద్యార్థులు పూజా రాయ్, సౌరదీప్ పాల్, విశేష్ గుప్తా తమ కాలేజీకి దగ్గరలో నివసించే పేద పిల్లలు టైర్లు, ఇతర వ్యర్థ పదార్థాలతో ఆనందంగా ఆడుకుంటూ ఉండడం చూశారు. అదే వ్యర్థ పదార్థాలతో పేద పిల్లల కోసం స్థిరమైన, ఇంటరాక్టివ్ ప్లేగ్రౌండ్‌లను నిర్మించడం గురించి ఆలోచించారు. స్క్రాప్ టైర్లు, మెటల్ డ్రమ్స్ వంటి వ్యర్థ పదార్థాలతో ఏకంగా ప్లే గ్రౌండ్స్ తయారు చేయాలనే ఆలోచన నుండి పుట్టింది యాంట్ హిల్ (Anthill) క్రియేషన్స్. ఒక పాఠశాలలో ఆట స్థలంతో మొదలైన వీరి ప్రయాణం ఆ తర్వాత దేశవ్యాప్తంగా 20 ప్రభుత్వ పాఠశాలల్లోని 300 ప్లేగ్రౌండ్‌లకు విస్తరించింది. దాదాపు రెండు లక్షల మంది చిన్నారులు వీరు తయారు చేసిన కొత్త తరహా ప్లే గ్రౌండ్స్ లో ఆడుకుంటూ ఉన్నారు.

యాంట్ హిల్ (Anthill) క్రియేషన్స్ బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ.. నిరుపేద పిల్లల కోసం ఆట స్థలాలను సృష్టించడం. అందరూ ఆడుకోవడానికి అవకాశం కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.


తమ ఐడియాను అమలు చేయాలనుకున్న మొదట్లో ఎన్నో ప్రతికూలతలు ఎదురయ్యాయని యాంట్ హిల్ (Ant hill) క్రియేషన్స్ బిజినెస్, డిజైన్ టీమ్ హెడ్ శ్వేత మణివణ్ణన్ చెప్పారు. "మా ప్రారంభ రోజుల్లో, కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆటల వలన పిల్లల కాన్సెన్ట్రేషన్ దెబ్బతింటుంది అని చెప్పడం మేము విన్నాము. పిల్లల జీవితాలలో ఆటల ప్రాముఖ్యతను ప్రజలు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు.


ఉదాహరణకు, ఊయల మీద ఆడటం కారణంగా పిల్లల వెస్టిబ్యులర్ బ్యాలెన్స్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆటలు సామాజిక నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడతాయి.. ఒక బృందంతో మెరుగ్గా ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్పుతుంది" అని శ్వేత చెప్పారు. స్వింగ్, స్లైడ్, సీ-సా (swing, slide, see-saw) వంటివి వీరి ప్లే గ్రౌండ్స్ లో సాధారణంగా ఉంటాయి.

స్క్రాప్ టైర్లను అప్‌సైక్లింగ్ చేయడం:

స్క్రాప్ టైర్లు, మెటాలిక్ డ్రమ్స్, ఇతర రీ సైక్లబుల్ వేస్ట్, వెదురుతో నిర్మించబడిన స్థిరమైన ఆట స్థలాలు. ఒక పాఠశాలకు ప్లేగ్రౌండ్ కావాలనే అవసరాన్ని తెలుసుకున్న తర్వాత ఈ సంస్థ బృందం ఆ ప్రాంతాన్ని సందర్శిస్తుంది. ప్లేగ్రౌండ్‌ను నిర్మించడానికి అవసరమైన సామాగ్రిని స్థానికంగా కొనుగోలు చేస్తారు. ఒక ప్లేగ్రౌండ్‌ని పూర్తి చేయడానికి గరిష్టంగా ఐదు నుండి ఏడు రోజులు పడుతుంది. Anthill బృందం ఇచ్చిన స్థలాన్ని ఇంటరాక్టివ్, స్థిరమైన ప్లేగ్రౌండ్‌లుగా మార్చి, తేలికైన, వేగవంతమైన, చౌకైన పరిష్కార మార్గాలను సృష్టిస్తుంది.


వ్యర్థ పదార్థాలతో చీమల పుట్ట ఎలా తయారవుతుందో అలా తాము ఈ ప్లే గ్రౌండ్స్ ను తయారు చేస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వేస్ట్ పదార్థాలను తిరిగి ఉపయోగిస్తూ.. వాటిని పిల్లలకు యుటిలిటీస్‌గా మారుస్తోంది యాంట్ హిల్ (Ant hill) క్రియేషన్స్ బృందం. "దేశంలో ప్రతిచోటా టైర్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని కంపెనీల వద్ద టైర్ వ్యర్థాలు ఉన్నాయి కానీ వాటిని పారవేసేందుకు సరైన యంత్రాంగం లేదు. ఈ టైర్ వ్యర్థాలలో కొన్ని అత్యంత కాలుష్యం కలిగిస్తాయి. మిగిలినవి ల్యాండ్‌ఫిల్‌లలో చేరుతాయి" అని చెప్పారు శ్వేత. "యాంట్ హిల్ (Ant hill) క్రియేషన్స్ ద్వారా మేము ఇప్పటివరకు దాదాపు 2,10,000 కిలోల టైర్లను అప్‌సైకిల్ చేసాము. ఈ వ్యర్థ టైర్లు మరియు స్క్రాప్ మెటీరియల్‌లను డంప్ చేయడానికి ల్యాండ్‌ఫిల్‌లుగా ఉపయోగించబడే 80,000 క్యూబిక్ అడుగుల స్థలాన్ని కూడా ఆదా చేసాము." అని మరింత వివరించారు.


పిల్లలు ఏమేమి ఆడటానికి ఇష్టపడతారు

ప్లేగ్రౌండ్ డిజైన్‌ కు ముందు ఈ బృందం మొదట పిల్లల మాటలను వింటుంది. ఒక పాఠశాల ప్లేగ్రౌండ్ అవసరాన్ని సంస్థకు తెలియజేసిన వెంటనే, యాంట్ హిల్ (Ant hill) క్రియేషన్స్ బృందం ఆ పాఠశాలలోని పిల్లలతో వారి ప్లేగ్రౌండ్‌లో ఏమి ఉండాలనుకుంటున్నారు.. లేదా వారు ఏమి ఆడాలనుకుంటున్నారు అనే దాని గురించి మీటింగ్ ను నిర్వహిస్తుంది. "మాది యూజర్-సెంట్రిక్ ప్లేగ్రౌండ్, ఇక్కడ పిల్లలు తమ ప్లేగ్రౌండ్‌లో ఏమి చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకుంటారు" అని శ్వేత తెలిపారు. ఈ ఆట స్థలాల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తాం. అలా చేయడం వలన వారు ఆ ప్లే గ్రౌండ్ తమది అని భావించడం ప్రారంభించి, ఆపై దానిని బాగా చూసుకుంటారు.


మహమ్మారి సమయంలో, పిల్లలు బయటకు వెళ్లి ఆడలేనప్పుడు, పిల్లలు ఇంటి లోపల కూర్చుని ఆడుకునే ఐదు నుండి ఏడు గేమ్స్ ను కలిగి ఉన్న 'ప్లే-ఇన్-ఎ-బాక్స్'ను యాంట్ హిల్ (Ant hill) క్రియేషన్స్ సృష్టించింది.

ఎక్కువ ఆడుకునే సమయం ఉంది అంటే.. ఎక్కువ హాజరు శాతం

యాంట్ హిల్ (Ant hill) క్రియేషన్స్ ప్లే గ్రౌండ్స్ ప్రభావం ప్రధానంగా సామాజిక, పర్యావరణ సంబంధమైనది. తమ అవుట్‌డోర్ ప్లేగ్రౌండ్ కార్యక్రమాలు దాదాపు 2 లక్షల మంది పిల్లలకు ఉపయోగపడ్డారని శ్వేత చెప్పారు. అంతేకాదు ఇలాంటి ఆట స్థలాలు నిర్మించిన చాలా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. "ఇప్పుడు, పిల్లలు ఆడుకోవాలనుకుంటున్నారు.. కాబట్టి పాఠశాలకు వెళతారు" అని శ్వేత తెలిపారు. ఈ ప్లే గ్రౌండ్స్ ఉన్న స్కూల్స్ లో ఉపాధ్యాయులు 60% మెరుగైన హాజరును గమనించారు.. 30% అధిక ఎన్ రొల్మెంట్ అభ్యర్థనలను గమనించారు. మునుపటి కంటే పిల్లలు తరగతిలో ఎక్కువ శ్రద్ధను కనబరుస్తున్నారని ఉపాధ్యాయులు చెప్పారు.



INK@WASH 3.0 (Innovations & New Knowledge in Water, Sanitation and Hygiene) లో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీలలో యాంట్ హిల్ (Ant hill) క్రియేషన్స్ కూడా ఒకటి. INK@WASH 3.0 హైదరాబాద్ లో మే 2022లో నిర్వహించనున్నారు. INK@WASH తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD), డిపార్ట్‌మెంట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. స్టార్టప్‌లు/ఆవిష్కర్తలు, సలహాదారులు, విద్యాసంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలకు నిధులు సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Next Story