నేటి నుంచి చార్మినార్‌, గోల్కొండ కోట‌లో సంద‌ర్శ‌కుల‌కు ఉచిత ప్ర‌వేశం

Free entry for visitors to Charminar and Golconda fort from today.దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏళ్లు పూరైన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2022 6:31 AM GMT
నేటి నుంచి చార్మినార్‌, గోల్కొండ కోట‌లో సంద‌ర్శ‌కుల‌కు ఉచిత ప్ర‌వేశం

దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏళ్లు పూరైన సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం 'ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్' వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తోంది. ఈ వేడుక‌ల్లో భాగంగా భార‌త పురావ‌స్తు శాఖ ఆధ్వ‌ర్యంలో ఉన్న‌ అన్ని స్మార‌క చిహ్నాలు, ప్ర‌దేశాల‌లో సంద‌ర్శ‌కుల‌కు ఉచితంగా ప్ర‌వేశం క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అందులో భాగంగా నేటి నుంచి హైద‌రాబాద్‌లోని చార్మినార్‌, గోల్కొండ కోట‌ను ఫ్రీగా చూడొచ్చు. అయితే.. ఈ అవ‌కాశం ఆగ‌స్టు 15 వ‌ర‌కు మాత్ర‌మే.

ఈ అవ‌కాశం భార‌తీయుల‌కే కాకుండా విదేశీయుల‌కు కూడా అందుబాటులో ఉంటుంద‌ని, భార‌త పురావ‌స్తు శాఖ ఆధ్వ‌ర్యంలోని సుమారు 3,400 ప్రాంతాల్లో ఆగ‌స్టు 5 నుంచి 15 వ‌ర‌కు ఉచిత ప్ర‌వేశం క‌ల్పిస్తున్న‌ట్లు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి చార్మినార్‌, గోల్కొండ కోట‌, వేయి స్తంభాల గుడి, వ‌రంగ‌ల్ కోట‌, పిల్ల‌ల మ‌ర్రి, రామ‌ప్ప ఆల‌యంలు ఉన్నాయి.

Next Story