నాస్ర్ స్కూల్ వ్యవస్థాపకురాలు బేగం అనీస్ ఖాన్ కన్నుమూత

నాస్ర్ స్కూల్ వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్, నాసర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్‌పర్సన్ బేగం అనీస్ ఖాన్ బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Aug 2023 6:38 AM GMT
Nasr School, Begum Anees Khan, Obituary

నాస్ర్ స్కూల్ వ్యవస్థాపకురాలు బేగం అనీస్ ఖాన్ కన్నుమూత 

నాస్ర్ స్కూల్ వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్, నాసర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్‌పర్సన్ బేగం అనీస్ ఖాన్ బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు విద్యార్థులు, విద్యావేత్తలు, చరిత్రకారులు నివాళులు అర్పిస్తూ ఉన్నారు.

బేగం అనీస్ ఖాన్‌కు నివాళులు అర్పిస్తూ.. ఆమె పూర్వ విద్యార్థి, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ సల్మా అహ్మద్ ఫరూఖీ ఇలా రాశారు:

అనీస్ ఆంటీ అరుదైన వ్యక్తి. 60 సంవత్సరాల క్రితం హైదరాబాద్ భూస్వామ్య పాలనలో, పర్దా వెనుక ఉన్నప్పుడు నాస్ర్ పాఠశాలను ప్రారంభించారు. ఆ సమయంలోనే ఆమె అడ్డంకులను దాటుకుని వచ్చారు. ఆమె అత్తమామలు, చాంద్ ఆప, వజీర్ మియాన్.. ఆమె భర్త కమల్ మామ ప్రోత్సాహంతో హైదరాబాద్‌ లో ఆమె విద్యా సంస్థను మొదలుపెట్టారు. నాణ్యమైన పాఠశాల విద్యను తీసుకురావడంలో ఆమెను ఏదీ ఆపలేకపోయింది. 1965లో ఒక గ్యారేజీలో కేవలం ఒక తరగతితో ప్రారంభించిన ఖుష్నుమా.. ఆ తర్వాత నాస్ర్ పాఠశాలగా మారింది.

నా సోదరి, నా భర్త 1967లో నర్సరీలో చేరారు. వారు ఆ స్కూల్ లో రెండవ బ్యాచ్ కు చెందిన విద్యార్థులు. నాస్ర్ ప్రారంభ సంవత్సరాల్లో కో-ఎడ్ స్కూల్‌గా ఉండేది. నేను 1971లో నర్సరీలో నాస్ర్‌లో చేరానని.. నా పాఠశాల విద్యను అక్కడి నుంచే పూర్తి చేశానని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రత్యేక బాలికల పాఠశాలగా మారింది.

అనీస్ ఆంటీ మాకు మోరల్ సైన్స్ క్లాస్ తీసుకునేవారు. తన విద్యార్థులు కేవలం విద్యను పొందడమే కాకుండా వారికి సరైన విలువలను కూడా నేర్పించాలని చాలా ఆసక్తి కనబరిచేవారు. పాఠశాల ఆవరణలో ఏటా నిర్వహించే మిలాద్-ఉన్-నబీ జల్సా నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆమె బోధన కోసం ఉత్తమ ఉపాధ్యాయులను నియమించింది. మాకు ICSEలో బోధించే సాధారణ సబ్జెక్టులే కాకుండా.. సంగీతం, నృత్యం, థియేటర్, కవిత్వం, కరాటే, SUPW, వంట, బాలికల గైడ్‌లు, పూల అమరిక, ఫుట్‌బాల్, త్రో బాల్, రిలే రేస్ మొదలైనవి ఉండేవి.

అనీస్ ఆంటీ మా క్లాసులను క్రమం తప్పకుండా సందర్శించేవారు. మాకు మా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు అన్నీ అందించేవాళ్లు. క్లే మోడలింగ్, పెయింటింగ్ కోసం పబ్లిక్ గార్డెన్స్‌లోని బాల్ భవన్‌కు ప్రతి వారం తీసుకెళ్లేవారు. అక్కడ కొన్నిసార్లు మమ్మల్ని బోటు షికారుకు కూడా పంపించేవాళ్ళు. ఆరు దశాబ్దాల క్రితం తన విద్యార్థుల పట్ల ఆమెకున్న దూరదృష్టిని గురించి చెప్పడం కోసమే నేను ఇదంతా చెబుతున్నానన్నారు. పాఠశాలకు సంబంధించి.. ప్రతి సంవత్సరం కేవలం ఒక తరగతిని మాత్రమే పెంచుకుంటూ వెళ్లారు. ఆమె విద్యార్థులకు కేవలం చదువు చెప్పడమే కాకుండా.. జీవితంలో పోరాడడానికి కూడా ఆమె సమాయత్తం చేసింది. విద్యార్థుల వ్యక్తిత్వాన్ని కూడా ఆమె తీర్చిదిద్దేవారు. అనీస్ ఆంటీ, నీ వల్లే ఈరోజు మేమందరూ మంచి స్థాయిలో ఉన్నాము. మేము మీకు చాలా రుణపడి ఉన్నాము. మేము మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాము.

Next Story