ఊర్వి సస్టైనబుల్ కాన్సెప్ట్స్.. ఫ్లోరల్ వేస్ట్ తో అద్భుతాలు

FloRejuvenation Hyderabad-based Oorvi is infusing life into floral waste.పెళ్లిళ్లలో, ఫంక్షన్స్ లో, మత పరమైన

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 May 2022 6:06 AM GMT
ఊర్వి సస్టైనబుల్ కాన్సెప్ట్స్..  ఫ్లోరల్ వేస్ట్ తో అద్భుతాలు

పెళ్లిళ్లలో, ఫంక్షన్స్ లో, మత పరమైన కార్యక్రమాలలో.. ఇలా ఎన్నో వాటిలో పెద్ద ఎత్తున పూలు వాడుతూ ఉంటాం. వాడిపోయాక వాటిని పారవేస్తూ ఉంటాం. వందల టన్నుల పువ్వులు చెత్తలోకే వెళుతుంటాయి. అయితే ఈ పూలతో అద్భుతాలు చేయవచ్చని ఎవరికైనా తెలుసా..? హైదరాబాద్‌కు చెందిన "ఊర్వి సస్టైనబుల్ కాన్సెప్ట్స్" పూల వ్యర్థాల నుండి పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఊర్వి సస్టైనబుల్ కాన్సెప్ట్స్.. మినల్ దాల్మియా, మాయా వివేక్‌ల ఆలోచనల్లో నుండి పుట్టింది. మన జీవితాలకు సార్థకత చేకూరేలా.. ఈ భూమికి తిరిగి ఇవ్వాలని భావించి తాము దీనికి రూపకల్పన చేసినట్లుగా ఊర్వి సహ వ్యవస్థాపకుడు మాయా వివేక్ చెప్పారు. అంతేకాకుండా మహిళలకు మరింత తోడ్పాటును అందించేందుకు కృషి చేస్తూ ఉన్నామని తెలిపారు.


"మినల్, నేను ఫ్లవర్ రీసైక్లింగ్ వైపు ఆకర్షితులయ్యాం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పూల వ్యర్థాలను సేకరించే ప్రక్రియ ఏదీ లేదు. ఈ పెద్ద వ్యర్థాలు ఎప్పటికప్పుడు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతూ ఉంటాయి. నీటి వనరుల్లో పేరుకుపోయి మన పర్యావరణానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి" అని మాయా వివేక్ చెప్పారు. దీన్ని అధిగమించేందుకు ఊర్వీ హోలీవేస్ట్ అనే 'ఫ్లోరల్ ప్రాజెక్ట్'ను ప్రారంభించింది. చెత్తలాగా పేరుకుపోతున్న పూల వ్యర్థాలను హోలీవేస్ట్‌లో భాగంగా మేము "ఫ్లో రిజువెనేషన్" అని పిలవబడే ప్రక్రియను తీసుకుని వస్తున్నాం. పూల చెత్తకు పునరుజ్జీవనం తీసుకుని వచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టామని మాయ చెప్పారు.


ఊర్వీ.. పలు దేవాలయాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, అనేక ఇతర సంస్థలతో జతకట్టింది. 2019లో ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు కేవలం ఒకటి-రెండు దేవాలయాలతో మాత్రమే భాగస్వామ్యం అయింది. ఇప్పుడు 45 దేవాలయాలు, ఎనిమిది ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకు తన కార్యకలాపాలను విస్తరించింది. "హోలీవేస్ట్‌లో భాగంగా, మేము అగరబత్తులు, సబ్బులు, ఎయిర్ ఫ్రెష్‌నర్‌లు, ఫ్లోర్ క్లీనర్, మెహక్ అనే సహజ మైనపు ట్యాబ్లెట్లు, రంగులు, మరెన్నో తయారు చేస్తాము" అని మాయ చెప్పారు. అన్ని ఉత్పత్తులు పూర్తిగా మొక్కల ఆధారితమైనవి, పర్యావరణ అనుకూలమైనవి అని ఆమె వివరించారు. ఇవి ప్రకృతికి హాని కలిగించవని తెలిపారు. "వ్యక్తిగతంగా, నాకు అగరబత్తి స్టిక్స్‌తో ఎప్పుడూ సమస్యలు ఉన్నాయి. ఎంత మంచి సువాసన ఉన్నా, అది అలెర్జీని కలిగిస్తుంది, కాబట్టి, మేము 2019లో ధూపం స్టిక్స్, నాన్-టాక్సిక్ ఉత్పత్తులను సృష్టించాం" అని మాయ వివరించారు.హోలీవేస్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా పూర్తిగా పూల పొడితో తయారు చేసిన చాప్‌స్టిక్‌ల కోసం స్టాండ్/హోల్డర్‌ను కూడా చేస్తుంది. ఇది మార్కెట్‌లో లభించే మెటల్, ప్లాస్టిక్ స్టాండ్‌లకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. "మేము త్వరలో డిష్‌వాషింగ్ లిక్విడ్, కార్ ఫ్రెషనర్‌లు, నాఫ్తలీన్ బాల్స్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేసే సహజమైన మోత్‌బాల్స్ వంటి మరిన్ని గృహోపకరణాలతో ముందుకు వస్తాము. మేము వాటిపై పని చేస్తున్నాము. ఈ ఉత్పత్తులు త్వరలో ప్రారంభించబడతాయి" అని మాయ చెప్పారు.


ఊర్వి వారానికి మూడు టన్నుల పూల వ్యర్థాలను సేకరిస్తుంది. ప్రారంభించినప్పటి నుండి, కంపెనీ 200 టన్నుల పూల వ్యర్థాలను సేకరించింది. గులాబీలు, బంతి పువ్వులు, క్రిసాన్తిమమ్‌లను సేకరిస్తూ వస్తోంది. వారి ఉత్పత్తులు సొంత వెబ్‌సైట్, అమెజాన్ వంటి ఇతర ఇ-కామర్స్ సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, బెంగుళూరు, పూణేలోని కొన్ని స్టోర్లలో కూడా ఇవి లభిస్తాయి. ప్రస్తుతం, హోలీవేస్ట్ ప్రాజెక్ట్‌లో పూల రేకులు మాత్రమే ఉపయోగించబడుతున్నాయి. మిగిలిన కాండం, ఆకులు, కంపోస్ట్ చేస్తున్నారు. నిపుణుల బృందం వాటిని కూడా ఉపయోగించుకు కోవాలనే ప్రయత్నం చేస్తోంది.


INK@WASH 3.0 (Innovations & New Knowledge in Water, Sanitation and Hygiene) లో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీలలో "ఊర్వి సస్టైనబుల్ కాన్సెప్ట్స్" కూడా ఒకటి. INK@WASH 3.0 హైదరాబాద్ లో మే 2022లో నిర్వహించనున్నారు. INK@WASH తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD), డిపార్ట్‌మెంట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. స్టార్టప్‌లు/ఆవిష్కర్తలు, సలహాదారులు, విద్యాసంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలకు నిధులు సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Next Story
Share it