శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మెయిల్ కలకలం, విమానం హైజాక్ చేస్తామని వార్నింగ్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్ కలకలం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 9:30 AM ISTశంషాబాద్ ఎయిర్‌పోర్టులో మెయిల్ కలకలం, విమానం హైజాక్ చేస్తామని వార్నింగ్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్ కలకలం సృష్టించింది. దాంతో.. అప్రమత్తమైన అదికారులు విమానంలో తనిఖీలు నిర్వహించారు. అధికారుల సోదాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా ఆందోళన పరిస్థితితులు కనిపించాయి.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం హైటెక్ బెదిరింపు మెయిల్ కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్టు అధికారులకు ఒక బెయిల్ వచ్చింది. విమానాన్ని హైజాక్ చేస్తున్నట్లు ఆ మెయిల్ బెదిరించారు దుండగులు. దాంతో.. అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేస్తున్నామంటూ ఆగంతకుడు మెయిల్ పంపడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే పరుగులు తీశారు. ఎయిర్‌పోర్టు అధికారులు సదురు బెదిరింపు మెయిల్ గురించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. అంతేకాదు.. ఎయిర్‌పోర్టు భధత్రా సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లు అయ్యింది. ఆగంతకుడి మెయిల్ అని అనుమానం వచ్చినా..చాన్స్ తీసుకోవద్దనే ఉద్దేశంతో అధికారులు, భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు.
అయితే.. అధికారులు, పోలీసులు ఓ వైపు తనిఖీలు చేస్తుంటే ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న కొందరు ప్రయాణికులు భయపడిపోయారు. అయితే.. హైజాక్ తాలూకు ఎలాంటి ఆనవాళ్లూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ మెయిల్ గా అధికారులు నిర్ధారించుకున్నారు. కాగా.. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది..? ఎవరు పంపించారు? అనే దానిపై టెక్నికల్ సిబ్బంది, పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు.