Hyderabad: ఐదేళ్ల పాప మృతి.. తట్టుకోలేక తండ్రి సూసైడ్

ఐదేళ్ల కన్నకూతురి మరణాన్ని తట్టుకోలేకపోయాడు తండ్రి. ఈలోకంలో ఉండొద్దని నిర్ణయం తీసుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on  28 Aug 2023 2:10 PM IST
Father Suicide,  Daughter Death, Hyderabad,

Hyderabad: ఐదేళ్ల పాప మృతి.. తట్టుకోలేక తండ్రి సూసైడ్

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఐదేళ్ల పాప చనిపోయింది. దాంతో.. కన్నకూతురి మరణాన్ని తట్టుకోలేకపోయాడు తండ్రి. తాను కూడా ఈలోకంలో ఉండొద్దని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ట్రైన్‌ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో విషాదచాయలు అలుముకున్నాయి.

ఖైరతాబాద్‌కు చెందిన కిశోర్ అనే వ్యక్తికి భార్యతో పాటు.. ఐదేళ్ల ఆరాధ్య అనే కూతురు ఉంది. ఆగస్టు 27న కిశోర్ తన భార్య, పాపతో కలిసి ఒక ఫంక్షన్‌కు వెళ్లాడు. అక్కడి వెళ్లాక ఫంక్షన్ అయ్యిపోయింది. అయితే... రిటర్న్‌లో కిశోర్‌ భార్యను అక్కడే ఉంచి.. పాపను మాత్రమే తనతో తీసుకొచ్చాడు. బైక్‌పై ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చేసరికి పాప ఉలుకూ పలుకూ లేకుండా బైక్‌పై ఉంది. దాంతో.. పడుకుందేమో అనుకుని లేపే ప్రయత్నం చేశాడ కిశోర్.. కానీ ఆ చిన్నారి ఎంతకీ లేవ్వలేదు. కూతురు చనిపోయిందని నిర్ధారించుకున్న కిశోర్‌.. ఎంతో ఏడ్చాడు. కన్నకూతురు తన కళ్ల ముందే ప్రాణాలు లేకుండా పడిఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు.

చిన్నారి ఆరాధ్యను ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. తన కూతురు చనిపోయిందని.. పాప లేని ఈ లోకంలో తాను ఇక ఉండలేనని బంధవులు, స్నేహితులకు మెసేజ్‌ చేశాడు కిశోర్. ఆ తర్వాత ఫోన్‌ను ఇంట్లోనే ఉంచి బయటకు వెళ్లిపోయాడు. ఇక ఇంటికి చేరుకున్న కిశోర్ భార్య.. పాప పడుకుని ఉందని అనుకుంది. భర్త కనబడలేదు.. బయటకు వెళ్లాడని అనుకుని తనపని తాను చేసుకుంది. ఎంతసేపటికీ పాప లేవ్వకపోవడంతో అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూసింది. చలనం లేకపోవడంతో భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. పాపను చూసిన డాక్టర్లు.. చిన్నారి చనిపోయి చాలా సమయం అవుతోందని చెప్పారు. దాంతో.. ఆ తల్లి తల్లడిల్లిపోయింది. కాసేపటికే ఆమెకు మరో ఫోన్‌కాల్ వచ్చింది.. తన భర్త కిశోర్ ట్రైన్‌ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని. ఒక వైపు కూతురు మరణం.. మరోవైపు భర్త సూసైడ్‌తో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది.

కాగా.. రైల్వే పోలీసులు కిశోర్ డెడ్‌ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక చిన్నారి ఆరాధ్య ఫంక్షన్‌కు వెళ్లి ఎలా మృతిచెందింది అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story