హైదరాబాద్ ట్రాఫిక్ లో.. ఇక అనవసరంగా హారన్ కొట్టారో
Explained how acoustic cameras will help Hyderabad Traffic police curb unnecessary honking.హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
By M.S.R
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బుధవారం నాడు అనవసరంగా హారన్లు మోగించే వాహనాలను గుర్తించేందుకు అకౌస్టిక్ కెమెరాలతో ట్రయల్ రన్ నిర్వహించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమీషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌తోపాటు భారతదేశంలోనే తొలిసారిగా అకౌస్టిక్ కెమెరాలను వినియోగించనున్నట్లు తెలిపారు. "అకౌస్టిక్ కెమెరాను ACOEM.. అనే ఒక జర్మన్ కంపెనీ ఉత్పత్తి చేసింది. ఇది అతి త్వరలో మా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ (APNR) సిస్టమ్‌తో అనుసంధానించబడుతుంది. నగరం లోని ట్రాఫిక్ ఫ్లోకు బాగా సరిపోయేలా పలు చోట్ల ఏర్పాటు చేయబోతున్నాం" అని రంగనాథ్ 'న్యూస్‌మీటర్'కి తెలిపారు.
"అకౌస్టిక్ కెమెరా, దాని అంతర్నిర్మిత సౌండ్ సెన్సార్‌లను ఉపయోగించి, అనవసరమైన హాంక్‌లు ఎక్కడ నుండి వచ్చాయో తెలుసుకోవచ్చు.. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు అనవసరంగా హారన్ మోగించే వారికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎవరు హారన్ అవసరంగా కొట్టారో గుర్తించిన తర్వాత, APNR సిస్టమ్‌ను ఉపయోగించి, మేము వాహనాన్ని గుర్తించి, అనవసరంగా హాన్ చేసినందుకు చలాన్‌లను జారీ చేస్తాము" అని ఆయన అన్నారు.
అకౌస్టిక్ కెమెరా లోని సాఫ్ట్‌వేర్.. సౌండ్ సోర్స్ ద్వారా అకౌస్టిక్, ఆప్టికల్ చిత్రాలను అందిస్తుంది. ఈ చిత్రాలను ఉపయోగించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హారన్‌లు అనవసరంగా చేశారా లేదా అనేది నిర్ధారిస్తారు. ధ్వని తరంగాల ఆధారంగా కేవలం సెకన్లలో విశ్లేషణ జరుగుతుందని, వీలైనంత త్వరగా ఫలితాల కోసం రియల్ టైమ్ సౌండ్ ఇమేజింగ్ అందించబడుతుందని రంగనాథ్ చెప్పారు. ఇజ్రాయెల్, జర్మనీ.. మరిన్ని దేశాలలో అనవసరమైన హారన్‌లను గుర్తించడానికి ప్రస్తుతం అకౌస్టిక్ కెమెరాలను ఉపయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. మరిన్ని ట్రయల్ రన్‌లు నిర్వహించిన తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నెల రోజుల్లో కెమెరాలను కొనుగోలు చేయనున్నారు.
డేటాను విశ్లేషించడం కష్టమేమీ కాదని.. వీటితోపాటు వాహనాల్లో ఎయిర్ హారన్లు ఉన్నవారిని కూడా బుక్ చేస్తామన్నారు. హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలోని చాలా ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, ఇతర భారీ వాహనాలు ఎయిర్ హారన్‌లను ఉపయోగిస్తాయని రంగనాథ్ తెలిపారు. "కేంద్రం మోటారు వాహనాల చట్టం, రూల్ 119 ప్రకారం ఎయిర్ హార్న్‌లకు కొన్ని వాహనాలకు అనుమతి లేదు. 110 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం చేసే ఎయిర్ హారన్లు లేదా హారన్‌లను ఉపయోగించే బైక్‌లు మరియు కార్లపై కూడా భారీ జరిమానా విధించబడుతుంది" అని రంగనాథ్ చెప్పారు.
హైదరాబాద్‌ను నో-హాంకింగ్ నగరంగా మార్చే ప్రయత్నంలో ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. "దీనిని మంత్రి కెటి రామారావు ప్రతిపాదించారు. హైదరాబాద్‌ను హాంకింగ్ రహిత జోన్‌గా మార్చడానికి ఆసక్తి చూపాలని అధికారులకు లేఖ రాశారు" అని రంగనాథ్ చెప్పారు. రంగనాథ్‌తో పాటు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్‌తో కమిటీని ఏర్పాటు చేశారు.