ఐటీ పరిశ్రమ టైర్-2 నగరాలకు కూడా విస్తరించాలి: జయేష్ రంజన్
Experts from the IT industry can now go as faculty to colleges as ‘Prof of Practice’ says Jayesh Ranjan.ఐటీ పరిశ్రమలో
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Oct 2022 3:36 PM GMTహైదరాబాద్‌లోని ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలంటే కేవలం సర్వీస్-ఓరియెంటెడ్ అని అనుకుంటాం. అయితే సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇప్పుడు సర్వీస్-బేస్డ్ కంపెనీలుగా మారుతూ ఉన్నాయి. ఐటీ ప్రోడక్ట్ కంపెనీలు వస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమలో అనేక సంవత్సరాలుగా సర్వీస్ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇప్పుడు వాటిలో మార్పు వస్తోంది. పలు ఐటీ కంపెనీలు ప్రోడక్ట్స్ లోకి ప్రవేశిస్తున్నాయని క్వాడ్రంట్ రిసోర్స్‌లో తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు & వాణిజ్యం (ఐ అండ్ సి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. గురువారం మాదాపూర్‌లోని రహేజా మైండ్‌స్పేస్‌లో హైదరాబాద్‌లో క్వాడ్రంట్ రిసోర్స్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ప్రారంభోత్సవానికి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
క్వాడ్రంట్ రిసోర్స్ అంచెలంచెలుగా ఎదగడం ఎంతో అభినందించాల్సిన విషయమని జయేష్ రంజన్ అన్నారు. గత ఏడేళ్లలో భారత్ లో చేపట్టిన కార్యకలాపాల్లో మీరు సాధించిన పురోగతి అద్భుతంగా ఉందని అన్నారు.. వరంగల్‌లో మీరు చేపట్టిన పనులను కూడా అభినందిస్తున్నామన్నారు. ప్రపంచంలో సాంకేతిక కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో మొత్తం ఐటీ పరిశ్రమ కేంద్రీకృతమై ఉందని.. ఇకపై ఐటీ పరిశ్రమ టైర్-2 నగరాలకు కూడా విస్తరించాలని అన్నారు. మీరు వరంగల్ కు వెళ్లడం.. ఇతర పెద్ద ఐటీ కంపెనీలకు విశ్వాసాన్ని ఇచ్చిందని.. అక్కడ ఇప్పుడు దాదాపు అరడజను IT కంపెనీలు ఉన్నాయని అన్నారు.
అవి ఇప్పటికే తమ ఉనికిని ఏర్పాటు చేసుకున్నాయని.. నిర్ణీత సమయంలో మిగిలినవి కూడా అక్కడకు చేరుకోడానికి ప్రణాళికలు రచిస్తూ ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో చాలా ఉత్పత్తుల అభివృద్ధి జరుగుతోంది. ఇక్కడ పెద్ద ఐటీ కంపెనీల ఉనికి గురించి మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ, ఐటీ పరిశ్రమకు నిజమైన వెన్నెముక మీలాంటి మధ్య తరహా కంపెనీలే అని రంజన్ అన్నారు. క్వాడ్రంట్ రిసోర్స్ అనేది 'క్లౌడ్ మరియు డేటా' కంపెనీ అని.. క్లౌడ్ మైగ్రేషన్ కు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మీరు సాధించిన విజయంతో మేము సంతోషిస్తున్నామని. మీరు భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలను సాధించాలని అనుకుంటూ ఉన్నానని తెలిపారు. ఉద్యోగులు ఆఫీసుల నుండి పని చేయడానికి మరింత ప్రోత్సహించాలని కోరారు.