ఎంబ్రేర్.. దేశీయ ఎయిర్ లైన్స్ లో ట్రెండ్ సెట్టర్ కాబోతోందా..?
Embraer's Largest aircraft to steal the show at wings 2022 in Hyderabad.ఎంబ్రేర్ (Embraer) సంస్థకు చెందిన అతిపెద్ద
By M.S.R
ఎంబ్రేర్ (Embraer) సంస్థకు చెందిన అతిపెద్ద వాణిజ్య విమానం "E195-E2" వింగ్స్ ఇండియా-2022లో ప్రదర్శించబడుతుంది. అంతేకాకుండా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎంబ్రేర్ బ్రెజిల్ కు చెందిన ప్రముఖ గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీ. మొత్తం విమానం ఫ్యూజ్‌లేజ్‌ను కవర్ చేసే అద్భుతమైన 'టెక్‌లయన్' లివరీ ఈ విమానం సొంతం. కొత్త తరం E-Jets కుటుంబంలో పెద్దన్నగా పిలుస్తున్నారు. E-Jets E2 లో 146 మంది ప్రయాణికులు కూర్చునేలా రూపొందించబడింది. సీటింగ్ విషయంలో టూ బై టూ విధానం ఉండనుంది.
"భారత విమానయాన రంగము ఒక మంచి స్థితిలో ఉంది. స్థిరమైన వృద్ధి కోసం విమానయాన సంస్థలు తమను తాము మార్చుకోవాల్సిన తరుణమిది" అని ఎంబ్రేర్ కమర్షియల్ ఏవియేషన్ సంస్థ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ రౌల్ విల్లారోన్ అన్నారు. "E195-E2 విమానంను ఉపయోగిస్తే తక్కువ ధరకే ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందించవచ్చు. భారతదేశంలో ప్రస్తుతమున్న ఎయిర్‌క్రాఫ్ట్‌లకు చాలా పోటీనిస్తుంది. భారత్ లోని ఎయిర్‌లైన్స్‌కు వృద్ధికి కూడా సరిపడే సరైన విమానమని.. టైర్-IIకి, టైర్-III నగరాల కనెక్టివిటీకి సరిగా సెట్ అవుతాయని," అన్నారాయన.
ఎంబ్రేర్ విశ్లేషణ ప్రకారం, కోవిడ్-19కి ముందు భారతదేశంలోని 50% దేశీయ విమానాల్లో ఒక్కో విమానానికి 90 నుండి 150 మంది ప్రయాణికులు ఉండేవారు. భారతదేశంలోని నాన్-మెట్రో నుండి మెట్రో నగరాలకు అనుసంధానించడానికి E195-E2 మంచి పనితీరును చూపించగలదు. E195-E2 అధిక పనితీరు, తక్కువ ఇంధనం కారణంగా లాభాలను ఆర్జించవచ్చని చెబుతున్నారు. విమానయాన సంస్థలకు అతి తక్కువ నిర్వహణ ఖర్చులు, మంచి రాబడి వచ్చేలా చేస్తుంది. ప్రయాణీకులకు మరింత సౌకర్యాన్ని ఇవ్వడమే కాకుండా వారి బ్యాగ్‌ల ను పెట్టుకోడానికి స్థలం, అతి తక్కువ శబ్దం కారణంగా పర్యావరణంపై తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అమెరికన్ ఏరోస్పేస్ తయారీదారు సంస్థ 'ప్రాట్ అండ్ విట్నీ' తయారు చేయబడిన PW1900G GTF ఇంజిన్‌ల ద్వారా శక్తిని పొందుతుంది.
E195-E2 నెదర్లాండ్స్‌లోని KLM, స్విట్జర్లాండ్‌లోని హెల్వెటిక్ ఎయిర్‌లైన్స్, బ్రెజిల్‌లోని అజుల్, నైజీరియాలోని ఎయిర్ పీస్ సంస్థలు ఆపరేట్ చేస్తుండగా.. త్వరలో కెనడాలోని పోర్టర్ ఎయిర్‌లైన్స్ కూడా ఈ విమానాలతో ప్రయాణాలను మొదలు పెట్టనున్నాయి. త్వరలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్‌లైన్స్ కూడా ఈ విమానాలను వాడనున్నాయి.