స్పుత్నిక్-వి టీకా పంపిణీ షురూ.. ఒక డోస్ ధర ఏంతంటే..

Dr Reddy's rolls out Sputnik V Covid-19 vaccine in India. తాజాగా రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు అనుమతులు లభించాయి.

By Medi Samrat  Published on  14 May 2021 3:10 PM IST
sputnik V

కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునే నేపథ్యంలో వాక్సిన్ లు పోషిస్తున్న పాత్ర ఎంతో ముఖ్యమైంది. ప్రస్తుతం మన దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉండగా, తాజాగా రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు అనుమతులు లభించాయి. ఇండియాలో ఈ టీకాల అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి అంగీకరించింది. దిగుమతి చేసుకున్న స్పుత్నిక్ వి మొదటి కన్‌సైన్‌మెంట్ ఈనెల 1న ఇండియాకు వచ్చింది. దీనికి సెంట్రల్స్ డ్రగ్స్ లేబొరేటరీ ఈనెల 13న రెగ్యులేటరీ క్లియరెన్స్ ఇచ్చింది. దీనిని మన దేశంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేస్తోంది.

దిగుమతి చేసుకున్న వాక్సిన్ ధరను ఒక్కొక్క డోసు ధర. 948 రూపాయలు, దీనికి జిఎస్టీ కలిపితే 995 రూపాయలు గా నిర్ణయించారు. తొలి డోసును ఈరోజు ఉపయోగించినట్టుగా డాక్టర్ రెడ్డీస్ సంస్థ ప్రకటించింది.. నిజానికి మన దేశంలో వినియోగిస్తున్న కో వాక్సిన్, కోవీషీల్డ్ టీకాలు మనకి ఉచితంగా లభిస్తున్నాయి. ఈ కంపెనీలకు ప్రభుత్వం నామ మాత్రంగానే డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ కొరత ప్రజలను ఇబ్బందులు పెడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి వచ్చిన స్పుత్నిక్-వి ఒక్కో డోస్ సుమారు 1000 రూపాయలకు ప్రజలకు అందిస్తున్నారు. అదే మన దేశీయంగా స్పుత్నిక్-వి టీకాలు తయారు చేస్తే వాటి ధర ఇంతకంటే తక్కువే ఉండవచ్చని భావిస్తున్నారు. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కూడా రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది.


Next Story