తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలను పాటించిన దిల్జిత్.. అభిమానుల ప్రశంసలు
నవంబర్ 15న తన హైదరాబాద్ కచేరీకి ముందు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం మద్యం, మాదక ద్రవ్యాలు లేదా హింసను ప్రోత్సహించే పాటలను ప్రదర్శించవద్దని ఆదేశించింది.
By అంజి Published on 17 Nov 2024 7:07 AM GMTతెలంగాణ ప్రభుత్వ ఆదేశాలను పాటించిన దిల్జిత్.. అభిమానుల ప్రశంసలు
నవంబర్ 15న తన హైదరాబాద్ కచేరీకి ముందు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం మద్యం, మాదక ద్రవ్యాలు లేదా హింసను ప్రోత్సహించే పాటలను ప్రదర్శించవద్దని ఆదేశించింది. అటువంటి థీమ్‌లు అతని సెట్‌లిస్ట్‌లో భాగమైన గత సందర్భాల వెలుగులో భాగంగా ఈ ఆదేశం వచ్చింది. ప్రతిస్పందనగా.. దిల్జిత్ తన సాహిత్యంలో సర్దుబాట్లు చేసాడు. ఇది అతని అభిమానులను చాలా ఆనందపరిచింది. కాన్సర్ట్ నుండి సోషల్ మీడియాలో వైరల్‌గ మారిన క్లిప్‌లలో గతంలో ఆల్కహాల్‌ను సూచించిన సాహిత్యాన్ని దిల్జిత్ మార్చి పాడటం చూడవచ్చు.
దోసాంజ్ కాన్సర్ట్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గాయకుడు దోసాంజ్ తన పాటల సాహిత్యాన్ని సర్దుబాటు చేస్తున్నప్పుడు నవ్వుతూ కనిపించాడు. ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ప్రేక్షకులను అలరించినందుకు దిల్జిత్‌ని అభిమానులు ప్రశంసించారు. ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఇలా రాశాడు. "చట్టపరమైన మార్గదర్శకాలకు కట్టుబడి చివరి నిమిషంలో అతను మరియు అతని బృందం సాహిత్యాన్ని సర్దుబాటు చేసిన విధానం ప్రశంసించదగినది. అతను ఆల్ టైమ్ గొప్పవాడని నిరూపించాడు."
తన సంగీత కచేరీలో మద్యం, హింసకు సంబంధించిన సూచనలతో కూడిన తన పాటలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించడంపై దిల్జిత్ దోసాంజ్ కూడా స్పందించారు. "ఇతర దేశాల నుండి కళాకారులు ఇక్కడకు వచ్చినప్పుడు, వారు కోరుకున్నది చేయడానికి అనుమతిస్తారు. కానీ మీ స్వంత దేశానికి చెందిన ఒక కళాకారుడు ప్రదర్శన ఇచ్చినప్పుడు, ప్రజలకు ఇబ్బంది ఉంటుంది" అని దిల్జిత్ అన్నారు.
''నా కచేరీలు కూడా టిక్కెట్లు అమ్మకానికి ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే అమ్ముడవుతాయి. అది కూడా చాలా మందికి సమస్యగా ఉంది. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డాను - ఇది ఒక్క రాత్రిపూట వచ్చే కీర్తి కాదు. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే, 1930కి కాల్ చేసి రిపోర్ట్ చేయాలని నేను సూచిస్తున్నాను'' అని దోసాంజ్ పేర్కొన్నాడు.
అక్టోబరు 26న న్యూ ఢిల్లీలో అతని ప్రదర్శనతో ప్రారంభమైన దిల్జిత్ కొనసాగుతున్న దిల్-లుమినాటి టూర్ యొక్క ఇండియా లెగ్‌లో హైదరాబాద్ మూడవ వేదిక . అతను తర్వాత అహ్మదాబాద్‌లో ప్రదర్శన ఇవ్వనున్నాడు.