హైదరాబాద్ బస్సుల్లో ఇక క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లు
తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బస్సుల్లోనూ డిజిటల్ లావాదేవీల
By Srikanth Gundamalla Published on 16 Jun 2023 10:27 AM ISTహైదరాబాద్ బస్సుల్లో ఇక క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లు
తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బస్సుల్లోనూ డిజిటల్ లావాదేవీలప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతోంది. డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగిపోయాయి. చిన్న కిరాణా కొట్టుకు వెళ్లినాఅక్కడ స్కానర్లు ఉంటున్నాయి. ఒక్కసారి ఫోన్‌తో దాన్ని స్కాన్ చేస్తే చాలా అమౌంట్ ఈజీగా ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఈ సదుపాయం వచ్చాక చాలా మందిజేబుల్లో డబ్బులు పెట్టుకుని తిరగడమే మానేశారు. అంతేకాక డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బస్సుల్లోనూ డిజిటల్ లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ఆర్టీసీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
కరోనా వేవ్స్ తర్వాత నగదు రహిత లావాదేవీలు ఎక్కువయ్యాయి. కాంటాక్ట్ లెస్ లావాదేవీలు జరపాలని ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి. బస్సుల్లోనూ ఈ పద్ధతి తీసుకురావాలని గతేడాదిలోనే భావించారు తెలంగాణ ఆర్టీసీ అధికారులు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైనట్లు చెబుతున్నారు. అయితే ఈ ఏడాదిలోనైనా బస్సుల్లో నగదు రహిత లావాదేవీలను అమల్లోకి తీసుకురావాలని అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా ముందు జిల్లాలకు తిరిగే సూపర్ లగ్జరీ బస్సుల్లో నగదుతో పాటు ఫోన్‌పే క్యూఆర్ కోడ్ జారీ ప్రక్రియలు రెండూ కొనసాగిస్తున్నారు. ఇదే విధానం హైదరాబాద్ సిటీ బస్సుల్లోనూ అమలు చేయాలన్న ఆలోచనతో ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు తిరుగుతున్న పుష్పక్ ఏసీ బస్సుల్లో నగదుతో పాటు డిజిటల్ ద్వారా టికెట్ జారీ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ ఆర్టీసీ అధికారులు.