రేపటి నుంచి తిరిగి తెరుచుకోనున్న డీఏవీ పబ్లిక్ స్కూల్

DAV Public School will reopen from tomorrow. హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌ను గురువారం (నవంబర్ 3) నుంచి పునఃప్రారంభించేందుకు

By అంజి  Published on  2 Nov 2022 6:07 AM GMT
రేపటి నుంచి తిరిగి తెరుచుకోనున్న డీఏవీ పబ్లిక్ స్కూల్

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌ను గురువారం (నవంబర్ 3) నుంచి పునఃప్రారంభించేందుకు విద్యాశాఖ అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి ఉత్తర్వులు జారీ చేశారు. డీఏవీ స్కూల్‌లో చదువుతున్న పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ఈ విషయం చాలా ఊరటనిచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నెం: 14లోని బాదం సరోజా దేవి డిఎవి పబ్లిక్ స్కూల్ డ్రైవర్ రజనీ కుమార్‌ను నాలుగున్నరేళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అక్టోబర్ 18న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని రిమాండ్‌కు తరలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అధికారులను డిమాండ్ చేశారు.

దీంతో ప్రభుత్వం అక్టోబరు 22న పాఠశాల అనుమతిని రద్దు చేసింది. బంజారాహిల్స్‌లోని పాత భవనంలో పాఠశాలను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ 650 మంది విద్యార్థుల తల్లిదండ్రులు అక్టోబర్‌ 23న కేబీఆర్‌ పార్క్‌ వద్ద నిరసనకు దిగారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా కలిశారు. పాత భవనంలో పాఠశాలను పునఃప్రారంభించాలని డీఈవో రోహిణిని కోరారు. పాఠశాల తెరవడంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించేందుకు అధికారులు బ్యాలెట్ విధానాన్ని నిర్వహించారు. 95% మంది తల్లిదండ్రులు దీనికి మద్దతు ఇచ్చారు. స్కూల్ డైరెక్టర్ నిషా కూడా ఇటీవల పాఠశాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పాఠశాలలో భద్రతా ఏర్పాట్లు చేయాలని పాఠశాల అధికారులను డీఈవో ఆదేశించారు.

Next Story