Hyderabad: క్వాక్ అరీనా పబ్‌లో డ్రగ్స్ కలకలం.. 8 మంది అరెస్ట్.. పార్టీలో నటి హేమ!
హైదరాబాద్‌లోని ఐటీ హబ్ కొండాపూర్‌లో గల 'క్వాక్ అరీనా' (Quack Arena) పబ్‌పై సైబరాబాద్ ఈగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు.
By - అంజి |
Hyderabad: క్వాక్ అరీనా పబ్‌లో డ్రగ్స్ కలకలం.. 8 మంది అరెస్ట్.. పార్టీలో నటి హేమ!
హైదరాబాద్‌లోని ఐటీ హబ్ కొండాపూర్‌లో గల 'క్వాక్ అరీనా' (Quack Arena) పబ్‌పై సైబరాబాద్ ఈగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. డ్రగ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఎనిమిది మంది డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
#Hyderabad:#EAGLE team conducted inspections at #pubs under the #Gachibowli Police Station limits.Acting on credible information, officials raided #QuakeArena pub in #Kondapur, where a late-night event titled “#DJBlackCoffee” was being conducted.During the inspection, live… pic.twitter.com/GBtUm8Jtj6
— NewsMeter (@NewsMeter_In) April 3, 2026
రాత్రివేళ మెరుపు దాడి - డ్రగ్ టెస్టులు:
గురువారం రాత్రి పబ్‌లో హై-ప్రొఫైల్ డీజే ఈవెంట్ జరుగుతుండగా, పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. అదే సమయంలో ఈగల్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అక్కడికక్కడే ఫీల్డ్ టెస్టింగ్ కిట్ల ద్వారా అనుమానితులకు డ్రగ్స్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా.. రితేష్, జ్యోతి రాదిత్య, రిత్విక్ వసాల, అభిషేక్ వర్మ, ఆకెళ్ల హరిత్ సారంగ, రిషబ్ శ్రీవాస్తవ, పిట్ల పృథ్వీ రాజ్, మోనిష్ సత్వాని అనే ఎనిమిది మందికి పాజిటివ్ అని తేలింది. వీరిని వెంటనే అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నటి హేమ వివరణ:
ఈ పార్టీకి హాజరైన టాలీవుడ్ నటి హేమ, దాడి అనంతరం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. తాను పబ్‌లో ఉన్న మాట వాస్తవమేనని, అయితే తనకు నిర్వహించిన డ్రగ్ టెస్టులో నెగటివ్ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. అధికారులు తన మూత్ర నమూనాలను సేకరించి అక్కడికక్కడే పరీక్షించారని, తాను ఎలాంటి డ్రగ్స్ సేవించలేదని ఆమె వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలను కూడా ఆమె పంచుకున్నారు.
ముమ్మరంగా దర్యాప్తు:
ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పబ్‌లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి? సరఫరాదారులెవరు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పబ్ యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘించిందా లేదా అన్నది కూడా పరిశీలిస్తున్నారు. నగరంలోని నైట్ లైఫ్ కేంద్రాల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు నిఘాను మరింత కఠినతరం చేశారు. వచ్చే రోజుల్లో మరిన్ని ఆకస్మిక తనిఖీలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.