మద్యం తాగి వాహనాలు నడిపే వారికి సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
CP Sajjanar Warns drunk and drivers.. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ పోలీసు కమిషనర్
By సుభాష్ Published on 14 Nov 2020 10:05 AM ISTమద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సర్జనార్ కొరఢా ఝులిపిస్తున్నారు. తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నవారిపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ఈ డ్రంకెన్ డ్రైవ్‌పై శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైన వారికి ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ -2 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సైబరాబాద్ పరిధిలో ప్రతి ప్రమాదాన్ని రోడ్ ట్రిఫిక్ యాక్సిడెంట్ మానిటరింగ్ సెల్ పర్యవేక్షిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో వాహనం నడిపేవారికి బీఏసీ పరీక్షలు నిర్వహిస్తామని, ప్రమాదం చేసి పారిపోయేందుకు ప్రయత్నించే వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆల్కాహాల్ పరీక్షలకు సహకరించని వారిపై కూడా చర్యలు
ప్రమాదాల సమయంలో ఆల్కాహాల్ పరీక్షలకు నిరాకరించే వారు, సహకరించని వారిపై కూడా ఎంవీయాక్ట్ 205 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల మాదాపూర్, గచ్చిబౌతి ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. పబ్‌ల యజమానులు ఊడా తమ పబ్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుకొంటూ వెళ్లేవారి పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవన్నారు.
2061 వాహనాలు వేలం
కాగా, సైబరాబాద్ పోలీసులు వివిధ రకకాల 2016 వాహనాలను వేలం వేయాలని నిర్ణయించారు. మొయినాబాద్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలో ఉన్న ఈ వాహనాల చట్టం ప్రకారం బహిరంగ వేలం వేస్తారు. ఈ వాహనాలపై అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ తేదీ నుంచి ఆరునెలల లోపు వాహనాలను క్రైయిమ్ చేయాలి. వివరాల కోసం సీఏఆర్ రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ వెంకటస్వామి, లేదా సైబరాబాద్ సెల్ నంబర్ 9491039164కు సంప్రదించాలని ఆయన సూచించారు.