ప్లానింగ్ మొత్తం అఖిల ప్రియ అపార్ట్‌మెంట్‌ నుంచే జరిగింది..!

CP Anjani Kumar Press Meet On Bowenpally Kidnap Case. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కేసీఆర్ బంధువుల కిడ్నాపింగ్ వ్యవహారంప మొత్తం అఖిల ప్రియ అపార్ట్‌మెంట్‌ నుంచే జరిగింది.

By Medi Samrat  Published on  11 Jan 2021 1:48 PM GMT
Bowenpally Kidnap Case

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కేసీఆర్ బంధువుల కిడ్నాపింగ్ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో భూమా అఖిలప్రియే సూత్రధారి అని ఆయన చెప్పుకొచ్చారు. అఖిలప్రియ, ఆమె పర్సనల్ అసిస్టెంట్ బోయ సంపత్ కుమార్, మల్లికార్జున్ రెడ్డి, డ్రైవర్ బాలా చెన్నయ్యను అరెస్ట్ చేసి వీరి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ఫేక్ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మల్లికార్జున్ రెడ్డి ద్వారా అఖిలప్రియ 6 సిమ్ కార్డులను కొనుగోలు చేశారని.. మియాపూర్ లోని సెల్ ఫోన్ షాపులో ఈ సిమ్ కార్డులను కొనుగోలు చేశారని.. మల్లికార్జున్, శ్రీను పేర్ల మీద వీటిని జనవరి 2న తీసుకున్నారని అన్నారు.

వీటిలో ఒక సిమ్ ను అఖిలప్రియ వాడగా, మరికొన్ని సిమ్ లను శ్రీను ఉపయోగించాడని పోలీసులు తెలిపారు. 6 సిమ్ కార్డుల లొకేషన్లు, టవర్లను గుర్తించామని.. కూకట్ పల్లిలోని లోధా అపార్ట్ మెంట్ లో అఖిలప్రియ నివాసం ఉన్నట్టు గుర్తించామని.. కిడ్నాప్ కు రెక్కీ కూడా అఖిలప్రియ ఆధ్వర్యంలోనే జరిగిందని అంజనీకుమార్ చెప్పారు. అఖిల ప్రియ నివాసం ఉంటున్న లోధా అపార్ట్ మెంట్ నుంచే దీనికి సంబంధించిన ప్లానింగ్ జరిగిందని అంజనీకుమార్ తెలిపారు. కిడ్నాప్ కోసం ఒక స్కార్పియో, ఒక ఇన్నోవా, ఒక టూవీలర్ ను ఉపయోగించారని తెలిపారు.

బోయిన్ ప‌ల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ పెట్టుకున్న బెయిల్ పిటిష‌న్‌ను సికింద్రాబాద్ కోర్టు తిర‌స్క‌రించింది. ఆమెను క‌స్ట‌డీకి ఇవ్వాల‌న్న పోలీసుల పిటిష‌న్ కు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. దీంతో అఖిల ప్రియను మూడు రోజులు పోలీసులు‌‌ క‌స్ట‌డీకి తీసుకోనున్నారు. అఖిల‌ప్రియ మెడిక‌ల్ రిపోర్టును చంచ‌ల్‌గూడ జైలు అధికారులు కోర్టుకు స‌మ‌ర్పించారు. ఈ నివేదిక‌ను ప‌రిశీలించిన అనంత‌రం కోర్టు బెయిల్ ఇవ్వ‌డానికి నిరాక‌రించింది.


Next Story
Share it