పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అంటే జోక్ అనుకున్నాం. కానీ ఇప్పుడు సింహానికి కరోనా అన్న వార్త కూడా ఈజీగా తీసుకోకండి. ఎందుకంటే ఇది నిజం. కరోనా మహమ్మారి హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులోనూ కలకలం రేపింది. హైదరాబాద్ జూ లో 8 సింహాలు కరోనా తరహా లక్షణాలతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఉద్యానవనంలో పనిచేసే వన్యప్రాణి వైద్యులు ఈ సింహాలకు ఆకలి లేకపోవడం, జలుబు మరియు దగ్గు వంటి కరోన లక్షణాలను గమనించారు. తక్షణమే నమూనాలు సేకరించి , వాటిని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ కి పంపించారు. సెకండ్ వేవ్ లో జంతువులకు కూడా వచ్చే అవకాశం ఉన్నందున 8 సింహాలకు కోవిడ్ టెస్ట్ చేయ డం జరిగిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు పార్కులు మూసి వేశారు. సింహాల కొవిడ్ పరీక్షల రిపోర్టులలో సింహాలకు సార్స్ cov 2 వైరస్ గా నిర్ధారించారు. వెంటనే వాటిని ఐసోలేట్ చేశారు. ట్రీట్మెంట్ కు స్పందిస్తున్నాయి అన్న డాక్టర్లు గత సంవత్సరం కూడా ఇలాంటి కేసులు చూసామని, జంతువుల ద్వారా కరోనా వ్యాధి సోకుతుంది అని నిర్ధారణ లేకపోయినప్పటికీ జాగ్రత్తగా ఉండటం అవసరం అన్నారు.

నిజానికి కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారులు ఈ నెల 2 నుంచే జూ పార్కును మూసివేశారు. సఫారీ ప్రాంతం 40 ఎకరాలు ఉండగా.. ఇందులో పది సంవత్సరాల వయసున్న 12 సింహాలు ఉన్నాయి.అటు గుజరాత్‌ లో కూడా అటవీ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని గిర్‌ సింహాల అభయారణ్యంతో పాటు ఇతర ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించింది. ముందు ఈ అభయారణ్యాలను షట్‌డౌన్‌ చేయడంతో పాటు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని గుజరాత్‌ అటవీ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా సిబ్బందికి ముందు యాంటీజెన్‌, RT-PCR టెస్టులు చేస్తారు. దీని కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తారుసామ్రాట్

Next Story