గ్రేట‌ర్‌లో బీజేపీకి కాంగ్రెస్ ఊహించ‌ని షాక్‌..!

Congress Won Lingojiguda Division. గ్రేటర్ హైదరాబాద్ పరిధి లింగోజిగూడ డివిజన్‎లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.

By Medi Samrat
Published on : 3 May 2021 12:40 PM IST

congress won in lingojiguda

గ్రేటర్ హైదరాబాద్ పరిధి లింగోజిగూడ డివిజన్‎లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ అకాల మరణంతో.. ఇక్క‌డ‌ ఉప ఎన్నిక జరిగింది. అయితే.. ఈ స్థానంలో నుంచి టీఆర్ఎస్ నుండి ఎవ‌రు బ‌రిలో లేరు. మంత్రి కేటీఆర్‌ను బీజేపీ ముఖ్య నేతలు రిక్వెస్ట్ చేయడంతో.. టీఆర్ఎస్ తరఫున ఎవర్నీ నిల‌పెట్టలేదు.

దీంతో మళ్లీ సిట్టింగ్ సీటు దక్కించుకోవచ్చన్న బీజేపీకి ఊహించని రీతిలో కాంగ్రెస్ షాకిచ్చింది. ఇక్క‌డ‌ బీజేపీ నుంచి అఖిల్‌ పవన్‌గౌడ్‌, కాంగ్రెస్‌ నుంచి దర్పల్లి రాజశేఖర్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా చాలిక చంద్రశేఖర్‌, జల్ల నాగార్జున, షేక్‌ ఫర్వేజ్‌ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి దర్పేల్లి రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ తాజా విజయంతో బల్దియాలో కాంగ్రెస్ కార్పొరేట్ల సంఖ్య మూడుకు చేరుకుంది.


Next Story