బ్రూ ట్రైబ్.. 30 రూపాయలకే అద్భుతమైన కాఫీ

Coffee on wheels Hyderabad's Brew Tribe Offers Freshly brewed Coffee on the go.మంచి కాఫీ తాగాలనే కోరికతోనే వారి ప్రయాణం

By M.S.R  Published on  3 April 2022 6:21 AM GMT
బ్రూ ట్రైబ్.. 30 రూపాయలకే అద్భుతమైన కాఫీ

మంచి కాఫీ తాగాలనే కోరికతోనే వారి ప్రయాణం మొదలైంది. బ్రూ ట్రైబ్ వ్యవస్థాపకుడు సంపత్ సముద్రాల, సహ వ్యవస్థాపకుడు సంజువార్ ఆఫీసు నుండి ఇంటికి కలిసి ప్రయాణిస్తూ ఉండేవారు. ప్రతిరోజూ వారు మంచి కాఫీ కావాలని కోరుకుంటారు. ఆఫీసుల్లోనూ, క్లయింట్‌ల స్థలంలో అందించే మెషిన్‌తో తయారు చేసిన ప్రీమిక్స్ కాఫీలు తాగుతున్నా పెద్దగా రుచికరంగా అనిపించేవి కావు. "ప్రీమిక్స్ కాఫీలు ఎప్పుడూ మంచిగా అనిపించవు. మంచి కాఫీని తాగాలంటే దాని కోసం చాలా డబ్బు చెల్లించాలి" అని సంపత్ తెలిపాడు.

అప్పుడే సంపత్ మంచి కాఫీని అన్ని చోట్లా ఎలా అందుబాటులో ఉంచాలా అనే ఆలోచన మొదలుపెట్టాడు. "నేను ఎక్లెక్టిక్ కార్ట్‌లపై తయారు చేసిన 'కాఫీ-ఆన్-ది-గో'ని ఎంచుకున్నాను. ఇది కాఫీ షాప్ తెరవడానికి అవసరమైన పెద్ద పెట్టుబడులను బాగా తగ్గిస్తుంది," అని అతను చెప్పాడు. "ప్రయాణాల్లో ఉండే వారికి తాజాగా తయారుచేసిన కాఫీని అందించవచ్చు.. కాఫీ ప్రియులందరికీ తాజాగా తయారుచేసిన కాఫీని తప్పకుండా స్వీకరిస్తారు" అన్నారాయన.


గత ఫిబ్రవరిలో పైలట్ ప్రాతిపదికన సైనిక్‌పురిలో ఒక కార్ట్‌తో ప్రారంభమైంది. ప్రజల నుండి స్పందన మోస్తరుగా ఉంది. "మార్కెట్‌ పై అవగాహనతో మేము జూలై 2021లో గచ్చిబౌలి ప్రాంతానికి మారాము. ఖాజాగూడ, చుట్టుపక్కల ప్రజలు దీనిని బాగా ఎంకరేజ్ చేశారు. అప్పటి నుండి, మా బ్రూ ట్రైబ్ ప్రయాణం ప్రారంభమైంది," అని అన్నారు. FICCI, T-హబ్‌ల సహకారంతో ఫిబ్రవరిలో కార్ట్‌లను లాంఛనంగా ప్రారంభించారు. 30 రూపాయల నుండి బ్రూ ట్రైబ్ వివిధ రకాల కాఫీలను అందిస్తుంది. నామమాత్రపు ధరకు ఐస్, కోల్డ్ కాఫీలను కూడా అందిస్తారు. వారు తమ స్వంత ప్రత్యేక బ్రూలకు సంబంధించి ఫ్రెంచ్ ప్రెస్, ఏరోప్రెస్, కెమెక్స్, పోర్ ఓవర్ లాంటివి ఉన్నాయి.


బ్రూ ట్రైబ్ అనేది ప్రత్యేకంగా శిక్షణ పొందిన బరిస్టాస్ బృందం, వారు ప్రతి కప్పుకు అప్పటికప్పుడు కాఫీ గింజలను గ్రౌండింగ్ చేయడం ద్వారా వినియోగదారులకు తాజాగా తయారుచేసిన కాఫీని అందిస్తారు. వారు తమకు నచ్చిన కాఫీని అందజేస్తారు. "ఇండియన్ కాఫీ ఫామ్‌ల నుండి ఎంపిక చేసుకున్న బీన్స్‌ను పర్ఫెక్ట్‌గా వేయించి, తమ రెసిపీ ప్రకారం వాడతారు. అద్భుతమైన సువాసన, స్ట్రాంగ్ మరియు రుచితో కూడిన కాఫీని అందరు మెచ్చుకుంటారు," అని సంపత్ తెలిపారు. "బీన్స్ కార్డినల్స్ మంచి కాఫీకి కావలసిన పదార్ధం. అందువల్ల, భారతదేశంలోని మూడు దక్షిణాది రాష్ట్రాల నుండి వాటిని తీసుకురావడంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాము." అని సంపత్ వివరించారు.


వీరి ప్రయాణం ఒక కార్ట్‌తో మొదలైంది. ఇప్పుడు ఎనిమిది వాహనాలు ఉన్నాయి. వీధుల్లో కొన్ని, డైవర్స్ ఓరియన్ వంటి టెక్ పార్క్‌లలో కొన్ని ఉన్నాయి. "ఖాజాగూడ సరస్సు, దుర్గం చెరువు, ఇనార్బిట్ మాల్ మరి కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ కార్ట్‌లను చూడవచ్చు. మేము 100 కార్ట్‌లకు ఎదగాలని ప్లాన్ చేస్తున్నాము, అయితే ఏదైనా కొత్త మార్కెట్‌లోకి ప్రవేశించే ముందు అన్ని భౌగోళిక సవాళ్లను పరిగణనలోకి తీసుకొని ఎదగడానికి మేము ప్రయత్నం చేస్తాం" అని సంపత్ తెలిపారు. బ్రూ ట్రైబ్ ప్రస్తుతం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే పనిచేస్తుంది, ఒక్కో కార్ట్ 100 కప్పులను అందిస్తోంది.

Next Story