Hyderabad: నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం

హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

By Srikanth Gundamalla  Published on  15 Sept 2023 10:31 AM IST
Child missing, niloufer Hospital, Hyderabad,

 Hyderabad: నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం

హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. చిన్నారి కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

నీలోఫర్‌ ఆస్పత్రికి ఓ మహిళ ఆరు నెలల చిన్నారి బాబుతో వచ్చింది. అయితే.. గురువారం సాయంత్రం సమయంలో బాబుని చూసిన ఓ మహిళ కాసేపు ఎత్తుకుంటానని కోరింది. ఇక అదే సమయంలో బాబు తల్లి భోజనం చేయాలని అనుకుంది. మహిళ బాబుని ఎత్తుకుంది కదా అని సదురు తల్లి భోజనం తీసుకురావడానికి వెళ్లింది. అలా రెండు నిమిషాల్లోనే తిరిగి వచ్చినా.. అక్కడ బాబుతో పాటు ఉండాల్సిన మహిళ ఇద్దరూ కనిపించలేదు. దాంతో.. భయాందోళనకు గురైన తల్లి చుట్టుపక్కలా మొత్తం వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో కిడ్నాప్‌గా భావించిన సదురు తల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.

తల్లి ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు వెంటనే నీలోఫర్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి ట్రీట్‌మెంట్‌ వార్డులో సీసీ కెమెరాలు లేవు. దాంతో.. మిగతా చోట్ల ఎక్కడైన బాబుని ఎత్తుకెళ్లిన మహిళ కనిపిస్తుందేమో అని అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఆరు నెలల బాబు ఉన్నట్లుండి కనిపించకపోవడంతో తల్లి తల్లడిల్లిపోతుంది.

Next Story