నిలోఫర్ ఆస్పత్రిలో దారుణం.. వంద కోసం చిన్నారి ప్రాణం తీశాడు
Child dead in Nilofer hospital with no Oxygen.సమాజంలో మానవత్వం నశించిపోతుంది. డబ్బే ప్రధానంగా కొందరు
By తోట వంశీ కుమార్ Published on 31 Oct 2021 4:53 AM GMTసమాజంలో మానవత్వం నశించిపోతుంది. డబ్బే ప్రధానంగా కొందరు మనుషులు ప్రవర్తిస్తున్నారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు. రూ.100కు కక్కుర్తిపడిన ఓ వార్డుబాయ్ కారణంగా మూడున్నరేళ్ల చిన్నారి ప్రాణం కోల్పోయాడు. ఈ అమానుష ఘటన హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎర్రగడ్డ ప్రాంతంలో నివాసం ఉండే మహ్మద్ ఆజం కొడుకు మహ్మద్ ఖాజా కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. ఓ ఆస్పత్రిలో చేర్పించగా.. మూడు రోజులకే రూ.2లక్షల బిల్లు అయ్యింది.
అంత ఖర్చు పెట్టే స్థోమత అతడికి లేకపోవడంతో మూడు రోజుల క్రితం బిడ్డను నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా డాక్టర్లు చిన్నారిని వెంటిలేటర్‌పై ఉంచారు. శనివారం ఆస్పత్రిలో కాంట్రాక్టర్ పద్దతిన పనిచేస్తున్న వార్డుబాయ్ సుభాష్ రూ.100 తీసుకుని ఆ బాలుడికి పెట్టిన ఆక్సిజన్ పైపు తీసి పక్క బెడ్‌లో ఉన్న రోగికి అమర్చాడు. దీంతో కొద్దిసేపటికే ఖాజా అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు.
వెంటనే చిన్నారి తల్లిదండ్రులు డాక్టర్లకు సమాచారం అందించారు. వారు వచ్చేలోగా బాలుడు మృతి చెందాడు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. ఎమ్మెల్యే పాషాఖాద్రి కూడా అక్కడికి చేరుకుని వైద్యులు,వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ వార్డుబాయ్ సుభాష్‌ను వెంటనే సస్పెండ్ చేశారు.