హైదరాబాద్ నుండి వెళ్లిన విమానం డైరెక్ట్ గా కరాచీలో ల్యాండ్.. అసలు విషయం ఏమిటంటే..?

Charter plane with 12 passengers takes off from Hyds RGIA lands in Pakistan's Karachi probe ordered. RGIA నుండి బయలుదేరిన ఛార్టర్డ్ విమానం పాకిస్థాన్ లో ల్యాండ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Aug 2022 12:50 PM IST
హైదరాబాద్ నుండి వెళ్లిన విమానం డైరెక్ట్ గా కరాచీలో ల్యాండ్.. అసలు విషయం ఏమిటంటే..?

హైదరాబాద్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (RGIA) నుండి బయలుదేరిన ఛార్టర్డ్ విమానం పాకిస్థాన్ లో ల్యాండ్ అవ్వడం సంచలనంగా మారింది. హైదరాబాద్ నుండి బయలుదేరిన ఈ విమానం కరాచీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిందని అధికారులు ధ్రువీకరించారు. ఆగష్టు 15 ఉదయం జిన్నా ఎయిర్ పోర్టులో ఈ విమానం ల్యాండ్ అయిందని తెలుస్తోంది. GL-5t విమానంలో తొమ్మిది మంది పురుషులు, ముగ్గురు ఆడవారు ఉన్నారు. ఈ విమానం ఆగస్టు 15న కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఆ విమానంలో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారని హైదరాబాద్ విమానాశ్రయ అధికారులు ధృవీకరించారు. హైదరాబాద్ నుండి కరాచీకి విమానం వెళ్లడం మాత్రం నిజమేనని న్యూస్‌మీటర్‌కు తెలిపారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన పాకిస్థాన్ ప్రభుత్వం విచారణ ప్రారంభించిందని నివేదికలు తెలిపాయి. GL-5 విమానం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం-హైదరాబాద్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:10 గంటలకు కరాచీ విమానాశ్రయంలో దిగినట్లు NewsMeter ద్వారా యాక్సెస్ చేయబడిన పత్రాల ద్వారా తెలుస్తోంది.

విమానంలో ఎవరెవరు ఉన్నారు..

అందులో ఉన్న 12 మంది ప్రయాణికుల పేర్లను పాకిస్థాన్ మీడియాలో ప్రసారం చేశారు. ప్రయాణీకుల జాబితాను న్యూస్ మీటర్ బృందం స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది. పాకిస్థానీ నివేదికల ప్రకారం ఆ విమానం ఆపరేటర్ గా 'ఫ్లై స్కై' వ్యవహారిస్తోంది.

జీఎంఆర్‌ అధికారులు ఏం చెప్పారు?

ఈ కథనాలపై GMR అధికారి ఒకరు NewsMeterతో మాట్లాడుతూ.. దుబాయ్ నుండి వచ్చిన చార్టర్డ్ ఫ్లైట్‌లో కేవలం ముగ్గురు (ప్రధానంగా ముగ్గురు సిబ్బంది) మాత్రమే ఉన్నారు. విమానంలో 12 మంది ఉన్నారనే నివేదికలలో ఎటువంటి నిజం లేదు. అందులో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారని చార్టర్డ్ ఫ్లైట్ ఆపరేటర్లు హైదరాబాద్‌లోని విమానాశ్రయ అధికారులకు అధికారిక సమాచారం అందించారు. 12 మంది ప్రయాణికులు వెళ్ళారనే సమాచారం తప్పు" అని అధికారి తెలిపారు. ఈ ఘటనపై GMR కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

దుబాయ్ నుండి వచ్చే చార్టర్ ఫ్లైట్‌ని ఫెర్రీ ఫ్లైట్‌గా మార్చారని అధికారి తెలిపారు. (ఏవియేషన్ పరిభాషలో ఫెర్రీ ఫ్లైట్ అంటే అందులో ప్రయాణీకులు ఉండరు. కేవలం సిబ్బంది మాత్రం ఉంటుంది).

Next Story