పెళ్లిపేరుతో మోసం చేశాడని యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు

యూట్యూబర్ హర్షసాయి ఇప్పటి యువతకే కాదు.. సోషల్‌ మీడియాను బాగా వాడుతున్న అందరికీ తెలుసు.

By Srikanth Gundamalla  Published on  24 Sept 2024 9:30 PM IST
పెళ్లిపేరుతో మోసం చేశాడని యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు

యూట్యూబర్ హర్షసాయి ఇప్పటి యువతకే కాదు.. సోషల్‌ మీడియాను బాగా వాడుతున్న అందరికీ తెలుసు. అయితే.. తాజాగా ఈ యంగ్‌ యూట్యూబర్‌పై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‪‌లో హర్షసాయిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనని మోసం చేశాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాదు.. తనను మోసం చేసి తన నుంచి రూ.2 కోట్లు తీసుకున్నాడని కంప్లైంట్‌లో పేర్కొంది. అంతేకాదు.. సదురు యువతి హర్షసాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణ పేరును కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. హర్షసాయి చాలా మందికి సాయం చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. మరి ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం.. అంతేకాదు ఆమెను పెళ్లి పేరుతో మోసం చేశాడని కంప్లైంట్‌ చేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

కాగా.. బాధిత యువతి హర్ష సాయితో కలిసి ఓ సినిమా నిర్మించినట్లు సమాచారం. ఆమెకు సొంత ప్రొడక్షన్ కూడా ఉందని తెలిసింది. హర్షసాయి హీరోగా మెగా అనే మూవీని బాధితురాలు నిర్మించారట. బాధిత యువతి.. బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్‌గా చేశారట.

Next Story