తుది శ్వాస విడిచిన బేగం రజియా బేగ్: హైదరాబాద్ థియేటర్ కమ్యూనిటీ ఐకాన్‌కి కళాకారుల సంతాపం

హైదరాబాద్‌లోని నాటకరంగం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది. ఆమెనే బేగం రజియా బేగ్.. ఇటీవలే ఆమె మనకు వీడ్కోలు పలికారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 April 2024 8:12 AM GMT
Begum Razia Baig, hyderabad Artists, Qadir Ali Baig Theater Festival

తుది శ్వాస విడిచిన బేగం రజియా బేగ్: హైదరాబాద్ థియేటర్ కమ్యూనిటీ ఐకాన్‌కి కళాకారుల సంతాపం 

హైదరాబాద్: నాటకరంగంలో, ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన వారు అతి తక్కువ మంది మాత్రమే ఉంటారు. హైదరాబాద్‌లోని నాటకరంగం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది. ఆమెనే బేగం రజియా బేగ్.. ఇటీవలే ఆమె మనకు వీడ్కోలు పలికారు. నగరంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాటకరంగంలో గొప్ప పేరు తెచ్చుకున్న బేగం రజియా బేగ్ మరణాన్ని ఎంతో మంది కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. రంగస్థల ప్రపంచంలో ప్రముఖురాలు, ఖాదిర్ అలీ బేగ్ థియేటర్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ బేగం రజియా బేగ్ కొద్దిరోజుల కిందటే హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆమె వయస్సు 73. తన భర్త ఖాదిర్ అలీ బేగ్‌తో కలిసి నగరంలో థియేటర్ రంగం పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించినందుకు పేరుగాంచారు బేగం రజియా బేగ్.

ఎంతో మందికి ఆమె ఒక ఆదర్శం

ఒక సొగసైన హైదరాబాదీ మహిళగా వర్ణించిన బేగం రజియా బేగ్ చాలా ప్రశాంతంగా ఉండేవారు. నిశ్శబ్ద ప్రవర్తనను కలిగి ఉండేవారు. ఆమె నడవడిక ఎంతో మందిపై ప్రభావం చూపించింది. ఏ ప్రాంతమైనా.. ఏ వేదిక అయినా ఆమె ఠీవి అలాగే ఉండేది. ఆమె ఉనికి నిరాడంబరంగా ఉన్నప్పటికీ.. రెండు తరాల థియేటర్ ప్రదర్శకులు, ప్రేక్షకులకు ఎంతో గొప్ప సేవ చేశారు. ఎంతో మందికి ప్రేరణగా కూడా ఆమె నిలిచారు.

తెహజీబ్- మర్యాదలు

బేగం రజియా బేగ్ హైదరాబాదీ తెహజీబ్, గొప్ప మర్యాదను ప్రతిబింబించే వారు. ఆమె సంసిద్ధమైన ప్రవర్తన గత యుగాన్ని ప్రతిబింబిస్తుంది, మర్యాదలు.. శుద్ధీకరణలు ఎంతో ప్రత్యేకమైనవి.. ఆధునికమైనవి కూడానూ!! ఆమె ప్రతి సంజ్ఞలో హైదరాబాదీ సంస్కృతిని చూపించేవారు. హైదరాబాద్ వారసత్వానికి ప్రాతినిధ్యం వహించారు.

కళను పోషించారు:

ముంబైకు చెందిన ప్రీమియర్ థియేటర్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నివేదిత బౌంతియాల్, బేగం రజియా బేగ్‌ను కళల పోషకురాలిగా అభివర్ణించారు. “హైదరాబాద్‌లో మాత్రమే కాదు.. భారతదేశం లోనూ.. విదేశాలలోనూ థియేటర్‌ ఆర్ట్స్ ను ప్రోత్సహించడంలో ఆమె అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం. తన అవిశ్రాంత ప్రయత్నాల ద్వారా, సృజనాత్మకత జ్వాల ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉండేలా చూశారు. భవిష్యత్ తరాల కళాకారులకు ఓ మార్గాన్ని ఏర్పాటు చేసింది” అని నివేదిత అన్నారు.

ఫ్లాగ్‌షిప్ ఫెస్టివల్-ప్రతిష్టాత్మక ప్రొడక్షన్స్

ఆమె ఆధ్వర్యంలో 'ఖాదిర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్' రాష్ట్ర ప్రధాన థియేటర్ ఈవెంట్‌గా ఉద్భవించింది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంది. వారసత్వం-ఆధారిత చారిత్రక దృశ్యాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు బేగం రజియా బేగ్. ప్రపంచవ్యాప్తంగా రాజభవనాలు, కోటల వద్ద ప్రదర్శించిన 'కులీ: దిలోంకా షాజాదా', 'సవాన్-ఎ-హయత్' నాటకాలతో ప్రేక్షకులను ఆకర్షించారు.

కళాకారుల కుటుంబం

బేగం రజియా బేగ్ వారసత్వం ఆమె పిల్లల జీవితాలలో కూడా భాగమైంది. ఆమె పెద్ద కుమారుడు, మొయిన్ అలీ బేగ్, ఢిల్లీ, న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదువుకున్నారు. థియేటర్‌పై తన అభిరుచిని కొనసాగించారు. ఆమె రెండవ కుమారుడు మహమ్మద్ అలీ బేగ్ 2014లో కళలకు చేసిన సేవలకు గాను పద్మశ్రీతో సత్కరించారు.

థియేటర్ కమ్యూనిటీకి తీరని లోటు:

బేగం రజియా బేగ్ మరణం హైదరాబాద్ థియేటర్ కమ్యూనిటీలో ఒక శూన్యాన్ని మిగిల్చింది. పద్మశ్రీ మహమ్మద్ అలీ బేగ్.. తన తల్లి వారసత్వాన్ని కొనియాడారు. ఆమె తన జీవితం మొత్తం థియేటర్ కోసమే ధారపోసిందని తెలిపారు. "ఆమె లేకపోవడం ఒక గొప్ప తల్లిని కోల్పోయానని మాత్రమే కాకుండా.. ఒక మార్గదర్శి, గురువు, విమర్శకుడు, స్నేహితుడిని కోల్పోయినట్లుగా భావిస్తున్నాను" అని మహమ్మద్ అలీ అన్నారు.

ఆమె లెగసీని కాపాడాలి:

ఎక్జూట్ థియేటర్‌కి చెందిన నటి, దర్శకురాలు జూహీ బబ్బర్ హైదరాబాద్ థియేటర్ కమ్యూనిటీలో బేగం రజియా బేగ్‌ ఒక చరిత్ర అని తెలిపారు. హైదరాబాద్ థియేటర్ కమ్యూనిటీ ఒక ఐకాన్ ను కోల్పోయింది. ఆమె దయ, నిబద్ధత, దాతృత్వం, వారసత్వం తరాల కళాకారులకు స్ఫూర్తినిస్తుందన్నారు.

Next Story