ఏసీబీ అధికారులకు చిక్కిన బంజారాహిల్స్ సీఐ

హైదరాబాదు నగరంలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కుకుంది.

By Srikanth Gundamalla  Published on  6 Oct 2023 10:42 AM GMT
Banjarahills, CI, caught,  ACB,  bribe,

 ఏసీబీ అధికారులకు చిక్కిన బంజారాహిల్స్ సీఐ

హైదరాబాదు నగరంలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కుకుంది. సమాజంలో మంచి హోదా... పలుకుబడి ఉన్న ఉద్యోగం... అయినా కూడా లంచానికి ఆశపడి చివరకు ఏసీబీ చేతికి చిక్కాడు.

నరేంద్ర అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేస్తున్నాడు. నరేంద్రతో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికి పోయారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్ 14లో ఉన్న స్కైలాంచ్‌ పబ్‌ యజమాని నుంచి రూ.3లక్షల లంచం ఇవ్వాలని సీఐతో పాటు ముగ్గురు పోలీసులు డిమాండ్ చేశారు. అయితే.. సదురు బాధితుడికి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కొంతకాలంగా నరేందర్‌పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయ్. కేసుల విషయంలో బాధితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. అలాగే ఓ కేసు విషయంలో రూ.3లక్షలు డిమాండ్ చేశాడు సీఐ నరేంద్ర. ఆ బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు సీఐతో పాటు ఎస్‌ఐ నవీన్ రెడ్డి, హోమ్ గార్డ్ హరిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌తో పాటు సీఐ నరేంద్ర చాంబర్‌, అతడి ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆస్తులకు సంబంధించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. సీఐ నరేంద్ర డీల్‌ చేసిన పలు కేసులకు సంబంధించి వివరాలు కూడా రాబడుతున్నారు ఏసీబీ అధికారులు. అంతేకాదు.. విచారణ సమయంలో షుగర్ లెవెల్ పడిపోతుందంటూ తనకు కాఫీ తెప్పించాలని సిఐ నరేంద్ర అధికారులను కోరాడు. దీంతో అధికారులు వెంటనే అతనికి కాఫీ తెప్పించారు. అనంతరం విచారణ కొనసాగించారు. అయితే.. పూర్తి సోదాలు, విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Next Story