బంజారాహిల్స్‌ డ్రగ్స్‌ వ్యవహారం.. సీఐపై వేటు

Banjara Hills CI Suspended in pub drugs issue.బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్ లో డ్ర‌గ్స్‌, ఇత‌ర మ‌త్తు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 April 2022 8:41 AM GMT
బంజారాహిల్స్‌ డ్రగ్స్‌ వ్యవహారం.. సీఐపై వేటు

బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్ లో డ్ర‌గ్స్‌, ఇత‌ర మ‌త్తు ప‌దార్థాలు ల‌భ్యం కావడాన్ని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. బంజారాహిల్స్ సీఐ శివచంద్రను సస్పెండ్ చేశారు. అలాగే ఏసీపీ సుదర్శన్‌కు చార్జ్‌మెమో జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఆయనపై చర్యలు తీసుకున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. కాగా.. ప‌బ్‌పై గ‌తంలో అనేక ఫిర్యాదులు వ‌చ్చిన‌ప్ప‌టికీ పోలీసులు ప‌ట్టించుకోలేదు అన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.


బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌పై ఆదివారం తెల్లవారుజామున మూడు గంట‌ల ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. హోటల్‌లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. పబ్‌లో కొకైన్‌, గంజాయి, ఎల్‌ఎస్‌డీ వినియోగించినట్లు గుర్తించారు. అయితే.. పోలీసుల రాకతో పబ్‌లోని యువతీ యువకులు డ్రగ్స్‌ను కిటికీ నుంచి కింద పడేశారు. బయట పడేసిన మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. పట్టుబడిన వారిలో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ కుమారుడు, మాజీ ఎంపీ కుమారుడు తదితర ప్రముఖుల పిల్ల‌లు ఉన్నారు. ఈ కేసులో నిహారికాను విచారించిన తర్వాత ఆమెకు నోటీసులు ఇచ్చారు. మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.

Next Story
Share it