బాలాపూర్ లడ్డూ వేలంపై కొత్త నిబంధన
బాలాపూర్ వినాయకుడికి ఎంతో ప్రత్యేక ఉంది. ఇక్కడ లడ్డూ వేలం బాగా ఫేమస్.
By Srikanth Gundamalla Published on 16 Sep 2024 4:00 PM GMTబాలాపూర్ వినాయకుడికి ఎంతో ప్రత్యేక ఉంది. ఇక్కడ లడ్డూ వేలం బాగా ఫేమస్. బాలాపూర్ వినాయకుడి లడ్డూకు మంచి డిమాండ్ ఉంటుంది. లడ్డూ వేలం లక్షల రూపాయలు పలుకుతుంది. ఎక్కడా లేని ధర ఉంటుంది. పోటాపోటీగా జరుగుతుంటుంది వేలం. అయితే.. ప్రతి ఏడాది సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. బలాపూర్ లడ్డూ వేలం 1994లో మొదలై ఇప్పటికీ జోరుగా కొనసాగుతోంది. సరిగ్గా 1994 అంటే మూడు దశాబ్దాల క్రితం రూ.450 పలికిన లడ్డూ ధర గతేడాది రూ.27 లక్షలు పలికింది
దాదాపు 20 ఏళ్ల నుంచి ఇక్కడ లడ్డూ లక్షలు పలుకుతోంది. అయితే బాలాపూర్ లడ్డూకు ఉన్న డిమాండ్ కారణంగా నిర్వాహకులు కొత్త నిబంధనను తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే పోటీదారులు ముందస్తుగా డబ్బును డిపాజిట్ చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. బాలాపూర్ లడ్డూ వేలం రేపు ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభం కానున్న విషయం. ఖైరతాబాద్ మహా గణపతి హుండీ ఆదాయాన్ని నిర్వాహకులు లెక్కించారు. మొత్తం రూ.70 లక్షల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. హోర్డింగ్‌లు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ.40 లక్షలు వచ్చినట్లు తెలిపారు.