హైదరాబాద్ లోని నిలోఫర్ లో వింత శిశువు జననం

Baby Born With Genetic Defect. హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో వింత శిశువు జన్మించిందనే వార్త వైరల్ అవుతోంది.

By Medi Samrat  Published on  22 March 2021 3:34 AM GMT
హైదరాబాద్ లోని నిలోఫర్ లో వింత శిశువు జననం

హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో వింత శిశువు జన్మించింది. హైదరాబాద్ లోని కాప్రా కి చెందిన సరళ, విజయ్ కుమార్ దంపతులకు ఈ శిశువు జన్మించిందంటూ ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఆ శిశువు కళ్లు ఎర్రని గోళాళ్లా కనిపిస్తూ ఉన్నాయి. చర్మం చీలి పోయినట్లుగా ఉంది. ముఖ్యంగా శిశువు శరీరభాగాలు ఇంకా ఎదిగినట్లుగా కనిపించడం లేదు. ఈ శిశువు ఇలా జన్మించడానికి కారణం హెర్లేక్వీన్ ఇచియోసీస్ అనే జన్యుపరమైన లోపం అని డాక్టర్లు నిర్ధారించారు. ఈ శిశువు పుట్టినప్పుడు బరువు 2 కేజీల ఆరువందల గ్రాములు బరువు ఉంది. నిలోఫర్ ఆసుపత్రిలోని రెండవ అంతస్తులో చికిత్స పొందుతోంది శిశువు. ఈ శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

ఇదిలావుంటే.. కొద్దిరోజుల కిందటే హైదరాబాద్ లో చేప ఆకారంలో శిశువు జన్మించిన సంగతి తెలిసిందే. హైకోర్టు సమీపంలోని పేట్ల బురుజు ఆస్పత్రిలో అచ్చం చేపలా శరీరం ఉన్న బిడ్డ పుట్టింది. ఈ శిశువు 2 గంటలకే ప్రాణాలు కోల్పోయింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ గర్భిణీకి నెలలు నిండడంతో ప్రసవం కోసం పేట్ల బురుజు ఆస్పత్రికి వచ్చింది. ఆమె ప్రసవించిన బిడ్డఅచ్చం చేపలా కనిపించింది. శిశువు నడుము పైభాగం వరకు బాగానే ఉంది. కానీ కింది భాగం చేప ఆకారంలో ఉంది. జననేంద్రియాలు, కాళ్లు సరిగా అభివృద్ధి చెందలేదు. శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు మొదటి 8-12 వారాలు ఎంతో కీలకమని.. ఆ సమయంలోనే అవయవాలు అభివృద్ధి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. సిగరెట్, మద్యంతో పాటు ఇన్‌ఫెక్షన్లు, పోషకాహారం వల్ల ఇలాంటి శిశువులు జన్మిస్తారని.. మేనరికం వలన కూడా జన్యుపరమైన లోపాలు తలెత్తుతాయని వైద్యులు తెలిపారు.Next Story