వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి అనుచరుడు సూరీడుపై అల్లుడి దాడి

attack on YS Rajasekhara Reddy follower Suridu. దివంగ‌త మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌ధాన‌ అనుచరుడు సూరీడు మీద అల్లుడి దాడి

By Medi Samrat
Published on : 24 March 2021 12:46 PM IST

attack on YS Rajasekhara Reddy follower Suridu

దివంగ‌త మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌ధాన‌ అనుచరుడు సూరీడు మీద దాడి జ‌రిగింది. జూబ్లీహిల్స్ లోని ఆయ‌న నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన సూరీడు అల్లుడు డా. సురేంద్రనాథ్ రెడ్డి క్రికెట్ బ్యాట్‌తో దాడిచేసి హత్యాయత్నానికి పాల్ప‌డ్డాడు. గతేడాది కూడా సురేంద్రనాథ్ రెడ్డి ఇదేరీతిన‌ సూరీడు మీద దాడి చేశాడు. ఇదిలావుంటే.. భార్యను వేధింపులకు గురిచేస్తుండడంతో గతంలో సురేంద్రనాథ్ రెడ్డి మీద గృహహింస కేసు న‌మోద‌య్యింది. అయితే.. ఆ కేసులను ఉపసంహరణ చేసుకోవడం లేదనే కక్ష్యతోనే మామ సూరీడును హత్య చేసేందుకు సురేంద్రనాథ్ రెడ్డి యత్నించార‌ని తెలుస్తోంది. సూరీడు కుమార్తె గంగా భవానీ ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు చేసిన జూబ్లిహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.



Next Story