శీను బండి.. చాలా ఫేమస్

At Bowenpally's Seenu Bandi you can choose from 20 kinds of Dosas.రోజూ ఒకే రకమైన దోసెలు తినేవారికి కాస్త వెరైటీగా రకరకాల

By M.S.R  Published on  6 March 2022 2:42 PM GMT
శీను బండి.. చాలా ఫేమస్

హైదరాబాద్: రోజూ ఒకే రకమైన దోసెలు తినేవారికి కాస్త వెరైటీగా రకరకాల దోసెలను అందించడానికి భాగ్యనగరంలో 'శీను దోసె' ఉంది. అక్కడ ఏకంగా 20 రకాల దోసెలు లభిస్తాయి. మీకు నచ్చే దోసెను మీరు ఆర్డర్ ఇచ్చి హ్యాపీగా తినేయొచ్చు. మెనూలో 20 రకాల దోసెలతో, సికింద్రాబాద్‌లోని బోయినపల్లిలోని శీను బండి ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది.

శీను బండి (అధికారికంగా శీను దోస సిద్దివినాయక టిఫిన్స్ అని పిలుస్తారు) కేవలం నాలుగు సంవత్సరాల క్రితం స్థాపించారు. అతి తక్కువ సమయం లోనే బోయినపల్లి పరిసర ప్రాంతాలలో టిఫిన్ ప్రియులు ఎక్కువగా హాజరయ్యే బండిగా మారింది. ముగ్గురు సోదరులు నిర్వహిస్తున్న ఈ టిఫిన్ సెంటర్‌లో ఇడ్లీ, వడ, మైసూర్ బోండా కూడా వడ్డిస్తారు. బి. శ్రీనివాస్ (38), చందు (33) ఉదయం దుకాణాన్ని చూసుకుంటారు. సాయంత్రం వినోద్ (35) దుకాణాన్ని చూసుకుంటారు.


శ్రీనివాస్ తనకు ఎప్పటి నుంచో వ్యాపారం చేయాలనే కోరిక ఉందని చెబుతుండేవాడు. "మేము ఆర్థికంగా కష్టపడుతూనే ఉన్నాం. చదువు అయిపోయాక.. ఉద్యోగాలు చేయడం ప్రారంభించాము, కానీ ఏదీ సరిగ్గా అనిపించలేదు, " అని గతంలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేసిన శ్రీనివాస్ చెప్పారు. వినోద్ వస్త్ర వ్యాపారంలో, చందు ఫిజికల్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉండేవారు. "మేము కష్టపడి కొంత డబ్బు ఆదా చేసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించాము" అని శ్రీనివాస్ తెలిపారు.

వ్యాపారాన్ని ప్రారంభించాలని తాము ఎప్పుడూ కలలు కన్నామని, అది ఇంత సక్సెస్ అవుతుందని అనుకోలేదని వినోద్ చెప్పారు. "తాము కూడా ఈ బిజినెస్ లో ఎత్తు పల్లాలను చూసిన వాళ్లమేనని, ఇప్పుడు వ్యాపారం జోరుగా సాగుతోంది'' అని ఆయన చెప్పారు.


రద్దీ సమయాల్లో లేదా వారాంతాల్లో ఎవరైనా శీను బండికి వెళితే, అక్కడ భారీగానే జనం ఉంటారు. కొన్నిసార్లు రుచికరమైన దోసె చేతికి అందాలంటే గంట సేపు కూడా వేచి ఉండాల్సి వస్తుంది. టిఫిన్ సెంటర్‌లో పిజ్జా దోస నుండి షెజ్వాన్ చీజ్ దోస వరకు దొరుకుతాయి. "మేము వివిధ వంటకాలను దక్షిణ భారత వంటకాలతో మిళితం చేసాము, దీంతో యూత్ ను కూడా ఆకర్షిస్తూ ఉన్నాము" అని వినోద్ వివరించారు. "దోసెలను ఎప్పటికప్పుడు కస్టమైజ్ చేస్తూ ఉంటాం. మేము మా కస్టమర్‌లు కోరుకున్నట్లుగా తయారు చేస్తాము, "అని ఆయన చెప్పారు. శీను బండిలో అమూల్ వెన్న, చీజ్ మాత్రమే ఉపయోగిస్తారు. "మేము తాజా పనీర్‌ను కొనుగోలు చేస్తాము" అని శ్రీనివాస్ తెలిపారు.


టిఫిన్ సెంటర్‌కు చాలా తక్కువ పెట్టుబడి అవసరమని అందుకే తాము దీనిని ఎంచుకున్నామని వినోద్ చెప్పారు. "దక్షిణ భారత టిఫిన్లు ఎలా చేయాలో మా అమ్మ నుండి బాగా నేర్చుకున్నాము" అని శ్రీనివాస్ చెప్పారు. ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి 3 లక్షలు ఉంటే చాలని అనుకున్నామన్నారు. "మొదట్లో మాకు వ్యాపారం లేదు. మాకు రోజుకు నలుగురైదుగురు కస్టమర్లు వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మాకు చాలా కస్టమర్లు ఉన్నారని మేము భావిస్తున్నాం"అని ఆయన చెప్పారు.

కరోనా మహమ్మారి మొదటి వేవ్ ముందు, రెండు అదనపు అవుట్‌లెట్‌లను తెరిచారు, కానీ అవి సక్సెస్ కాలేదు. "మేము ఇకపై విస్తరించాలని అనుకోలేదు. ఈ ఒక్క సెంటర్ పైనే దృష్టి సారిస్తాం'' అని శ్రీనివాస్ చెప్పారు. కనీసం 100 మందికి పార్టీ ఆర్డర్లు కూడా తీసుకుంటాము. ఇప్పటి వరకు 30-40 వేడుకల్లో వీరు కేటరింగ్ అందించారు.


శీను బండి మొదటి కస్టమర్లలో కొందరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. పాఠశాలకు ఎదురుగా ఉన్న బండి పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తోంది. "చాలా మంది విద్యార్థులు ఇక్కడ టిఫిన్ తినడానికి ఎగబడుతూ ఉంటారు. స్కూల్ పూర్వ విద్యార్థులు ఇప్పటికీ వచ్చి ఇక్కడే తింటుంటారు" అని సోదరులు చెప్పుకొచ్చారు.

Next Story
Share it