తెలంగాణలో లాక్ డౌన్ పై అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్ చూశారా..?

Asaduddin Owaisi Reaction On Lockdown. తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా లాక్ డౌన్ ను ప్రకటించారు. కరోనా కేసుల కట్టడి కోసం

By Medi Samrat  Published on  11 May 2021 1:43 PM GMT
Asaduddin Owaisi

తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా లాక్ డౌన్ ను ప్రకటించారు. కరోనా కేసుల కట్టడి కోసం లాక్ డౌన్ ను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేప‌టి నుంచి ప‌దిరోజుల పాటు ఈ లాక్‌డౌన్‌ కొన‌సాగ‌నుంది. ఈ ప‌దిరోజుల్లో ప్ర‌తిరోజు ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మాత్రం లాక్‌డౌన్‌ నుంచి మిన‌హాయింపు ఉంటుంది. ఈ స‌మ‌యంలో నిత్య‌వ‌స‌రాలు, ఇత‌ర వ‌స్తువుల కొనుగోలుకు వెసులుబాటు క‌ల్పించారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లు కానుంది. ఈ స‌మ‌యంలో దాదాపు అన్ని కార్య‌క‌లాపాలు నిలిచిపోనున్నాయి.

ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణలో లాక్ డౌన్ విధించడంపై స్పందించారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఆర్థికంగా దిగజారిపోతారని అన్నారు. లాక్ డౌన్ సమయంలో పేదలను ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలని. 10 రోజులకంటే ఎక్కువ రోజులు లాక్ డౌన్ ను అమలు చేస్తే పేదలు చాలా నష్టపోతారని ఆయన ట్వీట్ చేశారు. పేదలు తిండి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితులు లేకుండా చూడాలని అసదుద్దీన్ కోరారు. 10 రోజుల కంటే ఎక్కువ రోజులు లాక్ డౌన్ పెట్టకండని కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

"Lockdowns cause severe loss of livelihood & put many at risk. Request @TelanganaCMO @KTRTRS to not forget Telangana's poor & ensure that they receive maximum support from the govt for being forced to stay at home. Also hope that lockdown will not be extended beyond 10 days. If need be, govt should seek recourse from the Apex Court @TelanganaCMO was on record assuring that there will be no lockdown. It's concerning that, due to judicial overreach, govt had to walk back on this assurance. Courts interfering in health policy is a worrying sign. Constitutionally & practically, elected state governments are best placed to take these decisions" అంటూ అసదుద్దీన్ ట్వీట్లు చేశారు. లాక్ డౌన్ సమయంలో పేదలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధిని కోల్పోకూడదని చెప్పారు.








Next Story