హైదరాబాద్‌కు ఉత్తరాన మరో ఎయిర్‌పోర్టు
హైదరాబాద్‌కు ఉత్తరం వైపునా మరో ఎయిర్‌పోర్టు అవసరం ఉందని టీఎస్‌ఐఐసీ, ఎఫ్‌ఏసీ వీసీ, ఎండీ వెంకట్ నరసింహారెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 3:23 AM GMTహైదరాబాద్‌కు ఉత్తరాన మరో ఎయిర్‌పోర్టు
హైదరాబాద్‌కు ఉత్తరం వైపునా మరో ఎయిర్‌పోర్టు అవసరం ఉందని టీఎస్‌ఐఐసీ, ఎఫ్‌ఏసీ వీసీ, ఎండీ వెంకట్ నరసింహారెడ్డి అన్నారు. వచ్చే నెలలోనే మెట్రో రైల్‌తో పాటు విమానాశ్రయం ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు చెప్పారు. అయితే.. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో హిమ్‌టెక్స్, ఐపీసీ ఎక్స్ పో కార్యక్రమానికి వెంకట్ నరసింహారెడ్డి హాజరు అయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు వెంకట్ నరసింహారెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తుందని వెంకట్ నరసింహారెడ్డి చెప్పారు. ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు రాష్ట్రంలోని రహదారుల విస్తరణతో పాటు లింక్ రోడ్లను కలుపుకొని రీజనల్ రింగ్ రోడ్డును వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. దీనికోసం ఇప్పటికే భూసేకరణ పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో రైల్‌తో పాటు ఉత్తరాన ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులను వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నరసింహారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో వచ్చే మూడు, నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మరనున్నాయి అని అన్నారు.
మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో హిమ్‌టెక్స్, ఐపీసీ ఎక్స్ పో మూడ్రోజుల పాటు కొనసాగుతుందని వెంకట్ నరసింహారెడ్డి చెప్పారు. ఇందులో.. లో మెషినరీ, పరికరాల తయారీదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, ఫార్మా, కెమికల్స్, బయో టెక్నాలజీ, ఫుడ్, ఆగ్రో ప్రాసెసింగ్, పెట్రో కెమికల్స్, మినరల్స్, పవర్, స్టీల్ వంటి పరిశ్రమల నూతన ఆవిష్కరణలు ప్రదర్శించనున్నారు.