CISF: 54వ సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డేలో అమిత్ షా
54వ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) రైజింగ్ డే పరేడ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
By అంజి Published on 12 March 2023 10:42 AM IST54వ సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డేలో అమిత్ షా
హైదరాబాద్‌లోని హకీంపేటలోగల నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్‌ఐఎస్‌ఏ)లో ఆదివారం జరిగిన 54వ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) రైజింగ్ డే పరేడ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అమరులకు నివాళులర్పించిన అమిత్ షా.. సీఐఎస్‌ఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీఐఎస్‌ఎఫ్ మార్చి 10, 1969న భారత పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడింది. అప్పటి నుండి, ప్రతి సంవత్సరం మార్చి 10న సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది సీఐఎస్‌ఎఫ్ వార్షిక రైజింగ్ డే వేడుకలు ఇవాళ హైదరాబాద్‌లో జరుగుతున్నాయి.
అంతకుముందు శనివారం.. అమిత్ షా మాట్లాడుతూ సీఐఎస్‌ఎఫ్ భారతదేశ అంతర్గత భద్రతకు మూలస్తంభాలలో ఒకటిగా ఉందని అన్నారు. సీఐఎస్‌ఎఫ్‌కి అవసరమైన సాంకేంతిక పరిజ్ఞాన్ని సమకూర్చడంలో అన్నిరకాలుగా సహకారం అందిస్తామన్నారు. డ్రోన్ టెక్నాలజీని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. అధికారుల ప్రకారం.. సీఐఎస్‌ఎఫ్ దేశ రాజధాని న్యూఢిల్లీ వెలుపల 'రైజింగ్ డే' వేడుకలను నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇది ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్‌లోని సిఐఎస్‌ఎఫ్ మైదానంలో జరిగేది. గత ఏడాది ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 53వ రైజింగ్ డే వేడుకకు అమిత్ షా హాజరయ్యారు.
గత రెండు సంవత్సరాలుగా.. అన్ని పారామిలటరీ బలగాలు ఢిల్లీ వెలుపల తమ రైజింగ్ డేని జరుపుకుంటున్నాయి. ఒకప్పుడు లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం (LWE) ఆధిపత్యం చెలాయించిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో మార్చి 19న సీఆర్పీఎఫ్ వార్షిక రైజింగ్ డేని నిర్వహించనుంది. మార్చి 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బందికి వారి రైజింగ్ డే సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కీలకమైన ప్రదేశాలలో 24 గంటలపాటు భద్రతను అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
''సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది అందరికీ వారి ఉద్ధరణ దినోత్సవ శుభాకాంక్షలు. మా భద్రతా యంత్రాంగంలో సిఐఎస్‌ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుంది. వారు కీలకమైన, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలతో సహా కీలకమైన ప్రదేశాలలో రాత్రిపూట భద్రతను అందిస్తారు'' అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అమిత్ షా కూడా సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత పట్ల వారి అచంచలమైన నిబద్ధతకు సెల్యూట్ చేశారు.
#WATCH | 54th CISF Raising Day celebrations being held at CISF NISA, Hyderabad pic.twitter.com/phwCzem1Tb
— ANI (@ANI) March 12, 2023
— CISF (@CISFHQrs) March 12, 2023